–నల్లగొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి పర్యవేక్షణలో స్పెషల్ డ్రైవ్
–అడిషనల్ ఎస్పీ రాములు నాయక్
SP Ramulu Naik: ప్రజా దీవెన, నల్లగొండ :నల్లగొండ జిల్లాను మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా మిషన్ పరివర్తన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని నల్లగొండ జిల్లా ఏఎస్పి రాములు నాయక్ (SP Ramulu Naik)తెలిపారు. పరివర్తన కార్యక్రమంలో బాగంగా గంజాయి సేవించి (Consuming marijuana) పట్టుబడిన 80 మంది యువకులకు శనివారం వారి తల్లితండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ (Counseling) నిర్వహించారు. నల్లగొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాయే లక్ష్యంగా మిషన్ పరివర్తన్ లో బాగంగా జిల్లా యస్పీ శరత్ చంద్ర ఐపివఎస్ ఆదేశాల మేరకు అడి షనల్ ఎస్పీ రాములు నాయక్ ఆధ్వర్యంలో నల్గగొండ సబ్ డివి జన్ (Sub Division) పరిదిలో గల నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో స్పెషల్ డ్రైవ్ (Special drive)నిర్వహించి దాదాపు 80 మం ది గంజాయి సేవించి పట్టుబడిన యువకులకు వారి తల్లితండ్రుల సమక్షంలో గంజాయి సేవిస్తే ఆరోగ్యం పై పడే ప్రభావం, దాని వల్లనే కలిగే దుష్పరిణామాల, నష్టాల గురించి డాక్టర్ సైకియాట్రిస్ట్ అనిల్ చేత అవగాహన కల్పిం చారు.
ఈ సమావేశంలో అడిషనల్ యస్పీ మాట్లాడుతూ జిల్లా యస్పీ ఆదేశాల(YSP commands)మేరకు మిషన్ పరివర్తన్ లో బాగంగా డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా జిల్లాను ఏర్పాటు చేయుటకు ప్రతి రోజూ స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూన్నమని, గాంజా విక్రయించిన, సేవించిన, అక్రమ రవాణా చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ గంజాయి యుక్తవయస్సులో సేవించి దానికి అలవాటు పడి మీ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. యువత మాదక ద్రవ్యాల అలవాటు పడకుండా తల్లితండ్రుల పై బాధ్యత ఉందని అన్నారు.
ఒక్క సారి గంజాయి, డ్రగ్స్ కి (Marijuana, drugs)అలవాటు పడితే ఆర్దికంగా, ఆరోగ్యం పై అనేక రకాలుగా ప్రభావం పడుతుందని అన్నారు. ఎవరైనా డ్రగ్స్, గంజాయి విక్రయించిన, రవాణా చేసిన, సేవించినట్లు తెలిస్తే వెంటనే డ్రగ్ కంట్రోల్ నంబర్ 8712670266 సమాచారం అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి నార్కట్ పల్లి సిఐ నాగరాజు, ఆర్ ఐ సంతోష్, యస్.ఐలు నాగరాజు, ధర్మా, క్రాంతి కుమార్, విష్ణు మరియు సిబ్బంది పాల్గొన్నారు.