–నల్లగొండను తీర్చిదిద్దడమే లక్ష్యంగా “మిషన్ పరివర్తన్” కార్యక్రమం
–గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువతకు పునర్వవస్థీకరణ కార్య క్రమం
—నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్
–జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టే షన్ లలో గంజాయి టెస్టింగ్ కిట్లు అందుబాటులో
–జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో స్పెషల్ డ్రైవ్ లు
–గంజాయి సేవించి పట్టుబడిన దాదాపు 50 మంది యువకులకు తల్లితండ్రుల సమక్షంలో జిల్లా పో లీసు కార్యాలయంలో కౌన్సెలింగ్
SP Sarath Chandra Pawar:ప్రజా దీవెన, నల్లగొండ:నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయం ట్రాపిక్ ట్రైనింగ్ ఇనిస్ట్యూట్ (Tropic Training Institute)నందు జిల్లా లోని మునుగోడు,మిర్యాలగూడ ప్రాంతాలలో గంజాయి సేవించి పట్టుబడిన దాదాపు 50 మంది యువకులకు వారి తల్లితండ్రుల సమక్షంలో మిషన్ పరివర్తన్ కార్య క్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి దుష్పరిణామాలు,వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డా.శివ కుమార్ సైక్రి యటిస్ట్ పునర్వవస్థీకరణ కార్య క్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముక్య ముఖ్య అతిథిలుగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి (Narayana Reddy), జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ హాజరయ్యా రు.మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం ఏర్పాటు చేసిన మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో జిల్లా ఎస్పి మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవితా లను నాశనం చేసుకుంటున్నారని, ఒక్క సారి వీటికి బానిసైతే జీవితం లో కోలుకోవడం చాలా కష్టం అవు తుందని అన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లో మాదక ద్రవ్యాల టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని,ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తామని అన్నారు.ఒక్క సారి గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవిస్తే 6 నెలల వరకు దీని యొక్క ప్రభావం శరీరంలో ఉంటాయని అన్నారు.
తెలిసి తెలియక మొదటి సారిగా సేవించి పట్టుబడినారు కాబట్టి ఇట్టి పునర్వవస్థీకరణ కార్యక్రమం ద్వా రా మార్పు కొరకు ఇలాంటి కార్యక్ర మం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వీరికి ఇంకా 1,2 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ టెస్టింగ్ చేయబడతాయని అన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు.మళ్ళీ రెండవ సారి మాదక ద్రవ్యాలు సేవించి పట్టు బడుతే 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని గుర్తు చేశారు. ఒక్క సారి పట్టుబడి జైలుకు వెళ్తే జీవి తంలో ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యో గాలకు అనర్హులు అవుతారు అన్నారు. మాదకద్రవ్యాల క్రయవి క్రయాలు,వాటి వినియోగం పై ఉక్కు పాదం మోపుతామన్నారు. మాదకద్రవ్యాలు అమ్మిన, సరఫ రా,సేవించిన వెంటనే డయల్ 100 గాని వాట్స్ అప్ నంబర్ 87126 70266 గాని సంబంధిత పోలీస్ స్టేషన్ కి గాని సమాచారం అందిం చాలని వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) మాట్లాడుతూ పోలీసు శాఖ (Police Department) నల్ల గొండ జిల్లాను మాదకద్రవ్యాల రహి త జిల్లాగా మార్చుటకు మిషన్ పరి వర్తన్ కార్యక్రమం ద్వారా గంజాయి కి అలవాటు పడిన వారిని పున ర్వవస్థీకరణ ద్వారా మార్పు తీసు కొచ్చి వారిలో నూతన జీవితాన్ని రూపొంచిచేందుకు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని అన్నా రు.ఈ మాదకద్రవ్యాలకు బానిస కావడం వల్ల యువత జీవితాన్ని కోల్పోతుందని అన్నారు. మనిషి జీవితంలో 15 నుండి 30 సంవ త్సరాల లోపు వయసు చాలా ముఖ్యమైనదని, జీవితాన్ని మలు చుకునే ఈ వయసులో మాదక ద్రవ్యాలకు బానిస కావటం వల్ల జీవితం నాశనం అవుతుందని అన్నారు.యుక్త వయస్సులో కుటుంబాన్ని అండగా ఉండలని అన్నారు.
ప్రపంచంలోని అన్ని జీవుల కంటే మనిషి చాలా తెలివైన వారు అని, అలాంటి దానిని మత్తు పదార్థాలకు సేవించడం వల్ల మెదడుపై దాని యొక్క ప్రభావం పడడం వల్ల జంతులాగ మారి పోతుందని అన్నారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో యువత మాదకద్ర వ్యాల కు అలవాటు కావద్దని అన్నారు. గంజాయి సేవించి పట్టుబడి జైలుకు వెళ్తే మీ కుటుం బంలో మరియు సమాజంలో విలు వలు కోల్పోతారని అన్నారు. అలా గే తల్లితండ్రుల తమ పిల్లలు ఏం చేస్తున్నారు. ఎక్కడ తిరుగుతున్నా రనే విషయాలపై శ్రద్ధ చూపాల్సిన బాధ్యత చాలా ముఖ్యం అన్నారు. పిల్లలు మత్తుకు బానిస కాకుండా మొదట తల్లిదండ్రుల్లో అవగాహన (understanding)రావాలని అన్నారు. పర్యవేక్షణ చేయకపోవడం వల్లే పిల్లలు చెడు వైపు చూస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్పీ రాములు నాయక్,యస్బి డియస్పీ రమేశ్,నల్గొండ డియస్పీ శివరాం రెడ్డి,సిఐలు డానియల్,రవి కుమార్,ఆర్.ఐ సంతోష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.