SP Sarath Chandra Pawar: సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు, ఫెడెక్స్ కొరియర్ అంటూ మోసాల పట్ల జాగ్రత్త వహించాలి
ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : చట్టంలో డిజిటల్ అరెస్ట్ వ్యవస్థే లేదు. సిబిఐ ,ఈ డి,ఐటీ అధికారులు విడియో కాల్స్ తో విచారణ చేయరు జిల్లా ప్రజలు గమనించాలి.ఇటీవల ముంబాయ్ పోలీసులమని సైబర్ నేరస్తులు సామాన్య ప్రజలను,ఉద్యోగస్తులను టార్గెట్ గా చేసుకుని, ఫోస్ చేసే మేము ముంబాయి/నార్కోటిక్స్/CBI పోలీసులు అని చెప్పి, మీ పేరు, మీ ఆధార్, పాస్, బ్యాంకు డిటెయిల్స్ అన్ని చెప్పి, మీ పేరుతో ఒక పార్సెల్ ఇరాన్/ఇరాక్/ఇజ్రాయిల్ దేశాలకి వెళ్ళడానికి బుక్ అయింది.
ఆ పార్సెల్ ని మేము పట్టుకున్నాము,అందులో నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి,మీ మీద కేసు బుక్ చేస్తున్నాము అని చెప్తారు.మీ మీద కేసు బుక్ అయితే మీ ఉద్యోగం పోతుంది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, మీ పరువు పోతుంది, మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు అంటూ మభ్య పెడతారు.అలా చేయకుండా ఉండాలంటే వెంటనే డబ్బులు పంపండి వెంటనే పంపకపోతే మీ మీద కేసు ఫైల్ చేస్తాము అని టైం చెప్పి కంగారుపెడుతూ మీ చేత బలవంతంగా మీ వద్ద ఉన్న డబ్బులు మొత్తం పంపమని బెదిరిస్తారు మరియు బ్యాంకు లో లోన్ తీసుకునేటట్లు చేసి, ఆ డబ్బులు మొత్తం వాళ్ళకి పంపమని బెదిరిస్తూ మోసాలు చేస్తున్నారు.ఈలాంటి ఘటన ముంబై నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ అని చెప్పి నల్లగొండ 2 టౌన్ పరిదిలో ఒక బాధితురాలికి కాల్ చేసి పైన తెలిపిన విధంగా బ్యాంకు ఖాతాలోంచి దాదాపు రూ.5 లక్షలను లూటీ చేశారు.
తర్వాత తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో నల్గొండ రెండో టౌన్ పీఎస్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. ఈలాంటి ఘటనలో ఇప్పటికే చాలా మంది అమాయకులు మోసపోతున్నారు.కావున ఇలా వచ్చిన ఫోన్ కాల్స్ ని నమ్మవద్దు. నమ్మి మోసపోవద్దని సంఘటన జరిగిన వెంటనే 1930 కి పోన్ కాల్ చేయండి లేదా https://www.cybercrime.gov.in/ రిపోర్ట్ చేసి, మీ దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి రిపోర్ట్ ఇవ్వాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పి పేర్కొన్నారు.