పరీక్షా కేంద్రాల వద్ద 600 మంది సిబ్బందితో పటిష్ట భద్రత
ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్లగొండ పట్టణ కేంద్రంలోని ది నల్గొండ పబ్లిక్ పాఠశాల నందు ఏర్పాటు చేసిన గ్రూప్ 2 పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తును జిల్లా ఎస్పి పరిశీలించి మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్ II పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా 87 పరీక్ష కేంద్రాల వద్ద దాదాపు 600 మంది సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.
పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమల్లో ఉన్నందున ఎవరు గుంపులుగా ఉండకుండా చూడాలని, పోలీసు అధికారులకి సిబ్బందికి సూచించారు. అందరు బాధ్యతగా పని చేయాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష పత్రాలు స్ట్రాంగ్ రూముకు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు,అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు.