— 950 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు
— నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 4831 విగ్రహాల ఏర్పాటు.
–నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్
SP Sarath Chandra Pawar: ప్రజా దీవెన, నల్లగొండ: జిల్లాలో సోమవారం తలపెట్టిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేం దుకు అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ అన్ని కాల ముందస్తు ఏర్పాటు చర్యలు తీసుకుoదని నల్లగొండ జిల్లా యస్.పి. శరత్ చంద్ర పవర్ (SP Sarath Chandra Pawar) తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రధాన రహదారులతో పాటు వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీటివి కెమెరా లతో పాటు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, జిల్లా పో లీసు కార్యాలయానికి అనుసంధానం చేసి ఎలాంటి అవాంచనీయ సంఘ టనలు జరగకుండా పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేశామని తెలిపా రు. జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూం నుంచి అధి కారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని గణేష్ విగ్రహాలు, మండపాలకు (Nesh idols and mandapams) జియో ట్యాగింగ్ చేసిన పోలీసులు తెలిపారు. నల్లగొండ పట్టణ కేంద్రంలో ని 9 అడుగుల లోపు విగ్రహాలు నల్లగొండ పట్టణంలోని వల్లభ రావు చెరువు వద్ద నిమజ్జ నం ఏర్పాటు చేయడం జరిగింది. 9 అడుగుల పై బడిన విగ్రహాలు 14వ మైలురాయి వద్ద నిమజ్జనం ఏర్పా టు చేయడం జరిగిందని అన్నారు.
నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు జరగకుండ నిఘా పెట్టామని తెలి పారు. సిసిటివి కెమెరాల పర్యవే క్షణ లో శోభ యాత్ర జిల్లాలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారులు, నల్గొండ పట్టణంతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ ప్రధాన పట్టణాలలో గ ణేష్ నిమ జ్జన శో భయాత్రను 24/7 జిల్లా పోలీసు కార్యాలయం కమాండ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుంది. జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ తరపున నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్ (Community Policing)ద్వారా మా ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన సుమారు 1660 సీసీటీవీ కెమెరాలను ఆయా పోలీస్ స్టేష న్లకు అను సంధానం చేశామని అన్నారు.జిల్లాలోని ప్రధాన నిమ జ్జన ప్రాంతాలైన నల్గొండ పట్టణం లోని వల్ల భరావు చెర్వు, మూసి రివర్, 14 వ మైలురాయి, మిర్యా లగూడ వాడపల్లి, నాగార్జున సాగర్, దయ్యాలగండి, అడవిదే వులపల్లి, దేవరకొoడ, కొండబీ మనపల్లి, డిండి వద్ద పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏ ర్పాటు చేసి, పోలీసు (police) పికెట్లు ప్లడ్ లైట్లు, క్రేన్లు, ఏర్పాటు చేశామని నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉన్నారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసు కోవడంతో పాటు జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్లినా ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలో పెట్రో వాహనాలు, బ్లూకోట్స్, సం బంధిత పోలీసు అధికారులు అప్ర మత్తమయ్యేలా ఆన్లైన్ (online) విధానంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
పట్ట ణంలో ట్రాఫిక్ అంతరాయం కలగ కుండా ట్రాఫిక్ డైవర్షన్ తేది 16 సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రజలు, వాహనదారులకు శోభ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా శోభ యాత్ర నిర్వహించే మార్గం గుండా ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేశారు. వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు శోభ యాత్రకు నిర్దే శించిన మార్గం గుండా వెళ్తూ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసు వారికి సహకరించాలి. రోడ్డు హలియ దేవరకొండ వచ్చే వాహనదారులు హైద్రాబాద్ కు ఈద్గా వయా మునుగోడు జై పాస్ మీదిగా మళ్ళించనైనది. హైద్రా బాద్ నుంచి మిర్యాలగూడ వెళ్లే వాహనాలు నార్కట్పల్లి నకేరేకల్ వయా తిప్పర్తి మీదిగా మిర్యాలగూడ, మిర్యాలగూడ నుంచి హైద్రాబాద్ వెళ్లే వాహనాలు తిప్ప ర్తి, నకిరేకల్, నార్కట్ పల్లి మీదిగా హైద్రాబాద్ వైపు మళ్లిం చనైనది. నిమజ్జన భద్రత కోసం 950 మంది సిబ్బంది. గణేష్ నిమజ్జన శోభా యా త్ర సంద ర్భంగా జిల్లా పోలీసు శాఖ బారీ భద్రతను ఏర్పాటు చేసింది. జిల్లాలో ఒక ఎస్పీ, ఇద్దరు ఏ ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 28 మంది సీఐలు, 70 మంది ఎప్పలు. 620 మందికి పైగా ఏఎస్ఐ లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఏ సిబ్బంది. 250 మంది ట్రైనీ కానిస్టేబుళ్లు (Trainee Constables)బందోబస్తు విధులు హించనున్నారు.