Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP Sarath Chandra Pawar: అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీసు అమరవీరుల వారోత్సవాలు

— నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్

SP Sarath Chandra Pawar: ప్రజా దీవెన, నల్లగొండ: అక్టోబర్ 21 ఫ్లాగ్ డే పోలీసు అమరవీరుల సంస్మరణ (Commemoration of Police Martyrs)దినోత్సవం సందర్భంగా పోలీసు సంబంధిత అంశాలపై పలు కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ తెలిపారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విధినిర్వహణలో అమరులైన పోలీసుల ప్రాణా త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21 ఫ్లాగ్ డే పోలీసు అమరవీరుల దినోత్సవం అమరుల కుటుంబాల సమక్షంలో నిర్వహించనున్నందున జిల్లా ప్రజలు, విద్యార్థులు, యువ కులు పాల్గొని విజయవంతం చేయాలని ఒక జిల్లా ఎస్పి ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 21 నుంచి 31 వరకు వారి త్యాగాలను స్మరించు కుంటూ పోలీసు సంబంధిత అంశాలపై (Police related matters) కార్యక్రమాలు ఓపెన్ హౌస్,బ్లడ్ డొనేషన్,సైకిల్ ర్యాలీ, పోటో గ్రపీ,విడియో గ్రఫీ, షార్ట్ ఫిల్మ్ మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంద న్నారు. ఈ కార్యక్రమాలలో ప్రజలు విద్యార్థులు,యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.

–అక్టోబర్ 21, ఫ్లాగ్ డే (పోలీసు అమరవీరుల దినోత్సవం సంధర్బం గా జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద అమర వీరుల కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులర్పిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు, పాఠశాల, కళాశాలల విద్యార్థులకు,యువకులకు పోలీసులు విధినిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు, విధులు, అత్యవసర పరిస్థితుల్లో చేయవలసిన అంశాలపై, పోలీసు లు చేసిన ప్రతిభ, తదితర అం శాలపై ఈ నెల 23 న అవగాహన కల్పించడం.మండలాల వారీగా ప్రతి పోలీస్ స్టేషన్లో అవగాహన కల్పించడం జరుగుతుంది. అదే విధంగా జిల్లా పోలీసులు మరియు ప్రజల సహకారంతో ఈనెల 24 వ తారీకున జిల్లా పోలీసు కార్యాల యం పరేడ్ మైదానంలో (Parade ground)భారీ ఎత్తున మెగా రక్తదాన కార్యక్ర మాన్ని ఏర్పాటు చేయనున్నట్లు, జిల్లా ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అమరవీ రులను స్మరించుకుంటూ జిల్లా పోలీసులు ఈనెల 26 వ తారీఖున పట్టణంలో భారీ ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగు తుందని, ప్రజలు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

మొదటి విభాగం 12 వ తరగతి వరకు విచక్షణ తో కూడిన మొబైల్ ఫోన్ వాడకo అంశం పై రెండవ విభాగం డిగ్రీ పైబడి చది విన వారికితెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ రహిత రాష్ట్రంగా (A drug free state) తీర్చిదిద్దడం లో నా పాత్ర అనే అంశం పై తెలుగు,ఇంగ్లీష్,ఉర్దూ భాషలలో వ్యాసరచన పోటీలు నిర్వహిం చనున్నారు. ఇక జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులు యువత ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు, మరియు వీడియో గ్రాఫర్లకు, విడివిడిగా పోలీసు కీర్తి ప్రతిష్టలను పెంచిన అంశాలపై మూడు నిమిషాలకు తగ్గకుండా షార్ట్ ఫిలిం వీడియోలను రూపొందించాలని, పోలీసులు విధినిర్వహణలో చేసిన పనులు సంబంధించినవి, రోడ్డు ప్రమాదాల నివారణ,సైబర్ నేరాలు కమ్యూనిటీ పోలీసింగ్, మూఢ నమ్మకాలు ఇతర సామాజిక రుగ్మతలు అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల స్పందన ప్రకృతి వైపరీత్యాలలో పోలీసులు చేసిన సేవలపై,ఉత్తమ మొదటి మూడు ఫోటోలను మరియు మూడు వీడియోలను జిల్లా స్థాయిలో బహుమతిని ప్రధానం చేస్తూ రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా అర్హత లభిస్తుందని తెలియజేశారు.ఈ ఫోటోలను మరియు వీడియోలను ఐటి కోర్ విభాగం సోషల్ మీడియా ఫోన్ నెంబర్ 8712670426 గాని Email id nalgondasp@gmail.com ఈనెల 25 తారీకు లోగా వ్యక్తి గత వివరాలతో సహా అందించాలని సూచించారు.