.. జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్
SP Sarath Chandra Pawar: ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా నార్కట్పల్లి మండలం బ్రమ్మణవెళ్ళంలా ప్రాజెక్ట్, మెడికల్ కళాశాల ప్రారంభ కార్యక్రమం మరియు హెలిప్యాడ్, సభా ప్రాంగణం,దామరచర్ల థర్మల్ విద్యుత్ పరిశీలించి ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పి తెలిపారు. సి.యం పర్యటనలో భాగంగా బందోబస్తుగా ఐ.జి,డి.ఐ.జి, ఐదుగురు ఎస్పీలు,10 మంది అడిషనల్ ఎస్పీలు,25 మంది డీఎస్పీలు,75 మంది సిఐలు 170 మంది యస్.ఐలు సిబ్బంది 2500 మందితో పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
మెడికల్ కళాశాల ప్రారంభ అనంతరం పబ్లిక్ మీటింగ్ కి వచ్చే ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మార్గదర్శకాలు, పార్కింగ్ స్థలాలు, విఐపి లు వచ్చే మార్గాలు, ప్రవేశ మార్గాలు,ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రత్యేక ప్రాంతాలు గుర్తింవు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.అనంతరం బందోబస్తుకు వచ్చిన సిబ్బందికి పోలీస్ అధికారులు సిబ్బంది తమకు కేటాయించిన ప్రదేశలలో అప్రమత్తంగా ఉండి, విధులు నిర్వర్తించే సమయంలో సంయమనం పాటించాలని పక్కాగా విధులు నిర్వర్తించాలని ముఖ్యంగా పార్కింగ్, ట్రాఫిక్ డైవర్షన్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని తెలిపారు. సభ పూర్తి అయ్యేవరకు పటిష్ఠ భద్రత కల్పించాలని ఆదేశించారు.