SP Sarath Chandra Pawar: జిల్లాలో దొంగతనాల నివారణకు పటిష్ఠ నిఘా, ప్రత్యేక బృందాలు ఏర్పాటు.: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
SP Sarath Chandra Pawar: ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : మీ ఇంటి పరిసరాల్లో,కాలనీల్లో మరియు ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యత ఎంతో ముఖ్యం.అనుమానిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలి,వెంటనే తగు సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ కి అందించాలి.జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లాలో దొంగతనాలు నివారణకు పగలు రాత్రి పటిష్ఠ గస్తీ నిర్వహించాలని, పాత నేరస్తుల కదలికలపైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. రాత్రి,పగలు అన్ని ప్రాంతాల్లో క్షుణ్ణంగా గస్తీ నిర్వహించాలని పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానిత వ్యక్తుల కదలికల పైన నిఘా పెట్టాలని అన్నారు .ప్రతి కాలనిలలో ముఖ్యమైన కూడలిలో,రహదారుల వెంట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లా ప్రజలు కూడా ఈ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో దొంగతనాల నివారణకు జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ఠ నిఘా ఏర్పటు చేసి అన్ని ప్రాంతాలలో నిఘా పెట్టి నియంత్రణ చర్యలు చేపట్టామని అన్నారు.మీ ఇంటి పరిసరాల్లో, కాలనీల్లో,షాపులలో సిసిటివి కెమెరాలు అమర్చుకోవడం చాలా ముఖ్యమని, ఏదైనా సంఘటన జరిగిన వెంటనే సంబంధిత వ్యక్తుల కదలిక పై తగు చర్యలు తీసుకునుటకు వీటి ప్రాముఖ్యత చాలా అవసరం ఉంటుందని అన్నారు.కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాల్లో కాలనీల్లో,షాపులలో మరియు ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
దొంగతనాల నియంత్రణ జిల్లా ప్రజలు ఈ దిగువ తెలియజేసిన నిబoధనలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించగలరు. మీ విలువైన వస్తువులు బంగారం మరియు నగదు బ్యాంక్ లాకర్ లో బద్రపరచండి.మీ యొక్క ఇంటి డోర్ కి సెంట్రల్ లాకింగ్ వాడండి.సుదూర ప్రాంతాలకు వెళ్లే పట్టణ మరియు గ్రామంలోని ప్రజలు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ముందుగానే తెలియజేస్తే అక్కడ పోలీస్ వారు నిఘా ఏర్పాటు చేయవచ్చు.
3 మీ యొక్క ఇంటికి,షాపులు, కాలనీలు,పరిసరాలు,షాపింగ్ మాల్స్ హై క్యాలిటి కెమెరాలు మరియు రాత్రి వేళల్లో కనిపించే విధంగా (నైట్ విజన్) కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. పనిచేయని సి.సి.టి.వి కెమెరాలను పునరుద్దించుకోవాలి.వాటికి సుమారు ఒక నెల పాటు రికార్డ్ ఉండే అయ్యే విధంగా డివిఆర్ లు ఏర్పాటు చేసుకోవాలి.మీకు ఎవరిపైన అనుమానం ఉన్న,అపరిచిత వ్యక్తులు సమాచారం తెలిసిన సంబంధిత పోలీస్ వారికి వెంటనే తెలియచేయాలి.నేరస్థులు దొంగతనం చేయుటకు ఉపయోగించే వస్తువులు అనగా ఇనుప రాడ్లు,స్క్రూ డ్రైవర్ లాంటి ఇతర పరికరాలను దొంగలకు కనపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ యొక్క నివాస స్థలాలు కాలనీలకు దూరంగా ఉన్నట్లయితే తప్పని సరిగా సీసీటివి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి మరియు పగలు వేళలో కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీస్ వారికి వెంటనే సమాచారం ఇవ్వాలి. మీ ఇంటి నుండి ఎక్కువ రోజులు దూరంగా ఉండాల్సి వస్తే మి ఇంటి సమాచారాన్ని ఇరుగు పొరుగు వారి నుండి తెలుసుకోవాలి.
9.మీ ఇంటి వద్ద వృద్ధులు,మహిళలు,పిల్లల ఉన్న సమయంలో “అపరిచితులు” వచ్చి చెప్పే సమాచారం నమ్మకండి.
10.మీ కాలనీల వాసులు ” గస్తీ” తిరగడానికి కనీసం 25-40 సంవత్సరాల లోపు తెలివైన, నమ్మకమైన వ్యక్తులను మాత్రమే సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి.
11.ఏప్పటికప్పుడు పోలీస్ వారికి అనుమానితుల మీద మరియు దొంగతనాలపై సమాచారం అందించి పోలీస్ వారికి సహకరించండి.
12.మీ సమీప పోలీస్ స్టేషన్ల యొక్క సేవలను మరియు డయల్ 100 ను సద్వినియోగం చేసుకొని దొంగతనాలు నివారణకు సహకరించగలరు.