ప్రజాదీవెన, నల్గొండ : నల్లగొండ జిల్లాలో ప్రజలకు ట్రాఫిక్ నియంత్రణ ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగిందనీ అన్నారు.ట్రాఫిక్ నియంత్రణ కొరకు నూతనంగా వచ్చిన వారిలో 22 మంది సిబ్బంది వీరిలో 5 గురు మహిళా సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందనీ అన్నారు. వీరు పట్టణంలోని ప్రధాన కూడలిలో ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా విదులు నిర్వహించనున్నారనీ తెలిపారు. నీన్ననే దురదృష్టవశాత్తూ పట్టణంలోని హెవి వెహికిల్ క్రింద పడి ప్రమాదానికి గురై ఒక బాలుడు మరణించాడని,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పట్టణంలోకి హేవి వెహికిల్స్ రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
జిల్లా ప్రజలు కూడా పోలీస్ వారి సూచనలు పాటిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించడం ద్వారా జరిగేటువంటి రోడ్ యాక్సిడెంట్లను నివారించవచ్చని తెలియజేశారు. అదేవిధంగా వాహనదారులు కచ్చితంగా వాహనానికి సంబంధించిన కాగితాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలియజేశారు. వాహనాలు అతివేగంగా, రాంగ్ రూట్లో వాహనాన్ని నడిపి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదని తెలియజేశారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ను తప్పకుండా పాటించాలని మరియు హెల్మెట్ ను ధరించాలని తెలియజేశారు.
ప్రతిరోజు వెహికల్ చెకింగ్ లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ , రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి వాటిని గుర్తించి వారికి ఫైన్ విధించడం జరుగుతుందని రోడ్డుపైన వాహనాలను పార్కింగ్ చేయకుండా నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ చేయడం ద్వారా ట్రాఫిక్కు అంతరాయం ఉండదని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్పి వెంట నల్లగొండ డి.యస్.పి శివ రాం రెడ్డి,చిట్యాల సి.ఐ నాగరాజు, ట్రాఫిక్ సీఐ రాజు, చిట్యాల యస్.ఐ ధర్మా మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.