–పాలిష్ చేసి ఏపీ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్ లకు రవాణా
— రూ.18 లక్షల విలువ గల 504 క్వింటాల పిడిఎస్ రైస్, 2లారీ స్వా దీనం
SP sharath chandra pawar: ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజా సం క్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేసే పిడిఎస్ బియ్యంను పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కుల ఆట కట్టించారు నల్లగొండ పోలీసులు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద నిరంతర నిఘా తో పాటు విశ్వ సనీయ సమాచారంతో బుధవారం పక్క రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేసినట్లు నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ (sp Sharath Chandra Pawar)తెలిపారు. పిడిఎస్ బియ్యం స్వాధీన పరచుకొని నిందితులను అరెస్టు(arrest )కు సం బంధించిన వివరాలు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. పోలీస్ లతో పాటు పౌర సరఫరాల అదికారులతో కలసి వాడపల్లి గ్రామ శివారులోని బార్డర్ చెక్ పోస్ట్ వద్ద (border check post)వాహనాలను తనిఖీ చేయుచుండగా ఉదయం సమయంలో ఆంద్రప్రదేశ్ వైపు నుండి తెలంగాణ వైపునకు వస్తున్న KA56 2700 నెంబర్ గల ఒక లారిలో 245.40 క్వింటాలు పిడిఎస్ రైస్ ను తరలిస్తుండగా పట్టుకున్నారు.
సదరు రైస్ (rice)ను 30 కేజీ ల బరువు గల 818 ప్లాస్టిక్ సూపర్ బ్యాగ్ లలో నింపి తర లిస్తుoడగా పౌరసరఫరాల డిప్యూ టీ తహశీల్దార్ ఎస్ కె జావీద్ వాడపల్లి పోలీస్ సంయుక్తంగా KA56 2700 నెంబర్ గల లారిని, PDS రైస్ ను స్వాదినపరుచు కోవడం జరిగినది. అలాగే ఈ రోజు ఇదే క్రమంలో దాదాపు 8 లక్షల విలువ గల 250 కింటాల్ అక్రమ పిడియస్ బియ్యంను (rice)లారీ నెంబర్ GJ 25 U 2727 గల వాహనంలో బాపట్ల నుండి గుజరాత్ కి తర లిస్తున్నPDS రైస్ ను పౌరసర ఫరాల అదికారుల సమక్షంలో స్వాదినపరుచుకొని డ్రైవరు భీమ య్యను అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది.
ఏపీలోని బాపట్ల (bapatla) కు చెందిన చీమ కుర్తి సుధాకర్ రాధాకృష్ణ మూర్తి, కర్ణాటక కు చెందిన, సయ్యద్ సలావుద్దీన్ లను అదుపులోకి తీసుకోగా గుంటూరుకు చెందిన అశోక్ పరారీలో ఉన్నాడు. ఇది ఇలా ఉండగా వీరంతా గత కొన్ని సంవత్సరాలుగా బాపట్ల లోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర అయ్యప్ప ట్రేడర్స్ నందు రైతుల నుండి సేకరించిన వడ్ల తో పాటు పిడిఎస్ రైస్ ను గుంటూరు, బాపట్ల నరసరావు పేటలలో తక్కువ ధరకు కొనుగోలు చేసి తన యొక్క మిల్లులో వాటిని సన్న బియ్యం వలె పాలిష్ చేసిన తర్వాత అట్టి వాటిని 25 KG, 30 KG ల ప్లాస్టిక్ సూపర్ బ్యాగ్లలో పార్సిల్ చేయడం, సంబందించి నకిలీ బిల్లులు (fake bills)కూడా తయారు చేసి ఎవరికి అనుమానం రాకుండా తనకు తెలిసిన అశోక్ అనే గుంటూర్ కు చెందిన ఏజెంట్ ద్వా రా నెలకు 10 నుండి 12 లారీల లోడ్లులను ఆంద్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రలైన తెలంగాణ, తమిళనా డు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరా త్ మరియు రాజస్తాన్ లకు రవా ణా చేస్తూ అక్రమ వ్యాపారం చేస్తు న్నాడు. ఇదే క్రమంలో బుధవారం కర్ణాటక రాష్ట్రనికి చెందిన సయ్యద్ సలావుద్దీన్ యొక్క KA56 2700 నెంబర్ గల లారీ లో లోడ్ చేసి అట్టి వాటిని అశోక్ మరియు సుధా కర్ లు తెలంగాణ మీదుగా ముం బాయి కి తరలించే క్రమంలో అట్టి PDS రైస్ లోడ్ గల లారిని పట్టు బడి చేసి, కేసు నమోదు చేయడం జరిగినది. కాగా ఈ కేసును చాక చక్యంగా పట్టుబడి చేసిన మిర్యా లగూడ డీఎస్పీ K. రాజ శేఖర్ రాజు పర్యవేక్షణలో మిర్యాలగూడ రూరల్ సీఐ K.వీరబాబు ఆద్వ ర్యంలో వాడపల్లి ఎస్ ఐ, సిబ్బంది ని అభినందించారు.