ప్రజాదీవెన, నల్గొండ టౌన్: డిసెంబర్ 31st జిల్లా వ్యాప్తంగా అర్ధ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 246 మంది. ఆక్సిడెంట్ ఫ్రీ ఇన్సిడెంట్ ఫ్రీ యే లక్ష్యంగా ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో 31st వేడుకలు నల్లగొండ జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు జిల్లా ఎస్పి తెలియజేస్తూ, నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ప్రజల భద్రత కొరకు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి ఆక్సిడెంట్ ఫ్రీ ఇన్సిడెంట్ ఫ్రీ ఏ లక్ష్యంగా గత మూడు రోజులుగా జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకునేల కట్టుదిట్టమైన భద్రత పరమైయాన చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా కేవలం 31 డిసెంబర్ నాటి అర్ధ రాత్రి మద్యం తాగి వాహనాలు నడుపుతూ 246 పట్టుబడ్డారని వీరందరినీ న్యాయ స్థానం ముందు హాజరు పరచడం ద్వారా జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకోవడం అభినందనీయం అని తెలిపారు.