ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం
శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం నల్లగొండ మండలం దీపకుంట గ్రామం లో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ప్రజా దీవెన నల్గొండ: శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం నల్లగొండ మండలం దీపకుంట గ్రామం లో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణం అనంతరం నిర్వహించిన మొట్టమొదటి శ్రీ రాముల వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఆలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నామ వెంకన్న, తెలగమల్ల నరేష్ ,మాదరి కోటేశ్, బోగరి రామకృష్ణ, యాదయ్య, నామ వెంకటేశం, నామ పెద్దులు, నామ రాములు, వల్కి నాగయ్య, యనమల్ల శీను, మాదరి యాదయ్య, అరుణ్ బోగరి భరత్, పెరమళ్ళ మధు, బోగరి రంజిత్, అల్లే నాగరాజు, ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Sri Sitaramachandra Swamy wedding celebration