Srinivas Reddy:ప్రజాదీవెన, నల్గొండ టౌన్:ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవం మరియు 11వ మహాసభల జాతాను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం నల్లగొండ యుటిఎఫ్ భవన్ లో మీడియా సమావేశం లో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ 1974 లో ఏర్పడ్డ యుటిఎఫ్ క్యాడర్లకు ప్రాంతాలకు మేనేజ్మెంట్లకు అతీతంగా ఉపాధ్యాయులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ కోసం 50 ఏళ్లుగా కృషి చేస్తున్నదని అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు చావా రవి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 11 రాష్ట్ర మహాసభలు జరిగాయని, రెండవ మహాసభ ఉమ్మడి ఖమ్మం లో, 9వ మహాసభ హైదరాబాదులో, 11వ మహాసభ ఉమ్మడి నల్లగొండలో జరిగాయని అన్నారు. 17వ రాష్ట్ర మహాసభ కాకినాడలో జరుగుతుందని ఆ స్వర్ణోత్సవ మహాసభకు ఖమ్మం, హైదరాబాద్, నల్లగొండ నుం…