Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda SSC results: “పది”లమైన ఫలితాలు

పదో తరగతి ఫలితాల్లో నల్లగొండ జిల్లాలో ఈసారి పదిలమైన ఫలితాలు వచ్చాయి.

 

పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి

జిల్లాలో 96.11 శాతం ఉత్తీర్ణత

గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు

రాష్ట్రంలో 9వ స్థానం

ప్రజా దీవెన నల్లగొండ బ్యూరో: పదో తరగతి ఫలితాల్లో నల్లగొండ(Nalgonda) జిల్లాలో ఈసారి పదిలమైన ఫలితాలు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా అమ్మాయిలదే పై చేయిగా నిలిచింది. గత నెల 18 నుంచి ఏప్రిల్ 2 తేదీ వరకూ నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను(Result) రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్ బుర్ర వెంకటేశం మంగళవారం విడుదల చేశారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు.

జిల్లా వ్యాప్తంగా 19263 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కాగా 18513 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది జిల్లా ఉత్తీర్ణత శాతం 89.59 కాగా ఈసారి అది 96.11 శాతానికి ఎగబాకడం విశేషం. రాష్ట్రంలో జిల్లా గత ఏడాది 17వ స్థానంలో నిలిస్తే ఈసారి 9వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 10099 మంది బాలురకు 96 15 మంది బాలురు పరీక్షల్లో పాసై 95.21 శాతం సాధించారు. 91 64 మంది బాలికలు పరీక్ష రాయగా 8898 మంది ఉత్తీర్ణులై 97.10 శాతం సాధించారు.

జిల్లాలో ఈసారి సున్నా శాతం(Zero percent)ఫలితాలు సాధించిన పాఠశాల ఒక్కటి కూడా లేకపోవడం విశేషం. ఈ పరీక్షల్లో మొత్తం 750 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరికి జూన్ 3వ తేదీ నుండి 16వ తేదీ వరకూ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు రీ వెరిఫికేషన్, కౌం టింగ్ కు నేటి నుండి 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

 

17 నుండి 9వ స్థానానికి….

విద్యార్థుల ప్రగతిపై ప్రభుత్వం, విద్యా శాఖ అధి కారులు, ఉపాధ్యాయులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. టెన్త్ (10th)జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించింది. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఫోకస్ పెట్టి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చారు. పాఠ్యాంశాలపై పట్టు సాదించేలా తీర్చిదిద్దారు. సకాలంలో సిలబస్ పూర్తి చేసి, తిరిగి రివిజన్ చేయడంతో విద్యార్థులు పాఠ్యాంశాలను సులువుగా గుర్తు పెట్టుకుని పరీ క్షల్లో రాసేలా శిక్షణ ఇచ్చారు.

ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులతో తరచుగా సమావేశమై, తగు సూచనలు ఇచ్చారు. విద్యార్థులకు(Students) ప్రతి నెలా పరీక్షలు నిర్వహించి, వారి ప్రతిభను గుర్తించారు. వెనుకబడవుతున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నమూనా పబ్లిక్ పరీక్షలు నిర్వహించి, వాటిలో మార్కుల సాధనపై విద్యార్థులకు సలహాలు, సూచనలు అందజేశారు. ఫలితంగా విద్యార్థులు ఆయా సబ్జె క్టుల్లో మంచి పట్టు సాధించారు. ఇటువంటి చర్య లన్నీ మెరుగైన ఉత్తీర్ణతకు దోహదం చేశాయని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. గత ఏడాది రాష్ట్రంలో జిల్లాది 17వ స్థానం కాగా ఈ ఏడాది 9వ స్థానంలో నిలిచింది.

పాఠశాల వారీగా వివరాలు…

నల్లగొండ జిల్లాలో మొత్తం 317 పాఠశాలలు ఉండగా అందులో 156 ప్రైయివేట్ వి కాగా మిగతావి 161 పాఠశాలలు ఎయిడెడ్, రెసిడెన్షియల్, గురుకులాలు, కస్తూరిబా, మోడల్ స్కూల్ తదితర పాఠశాలలు ఉన్నాయి. అందులో ఏయిడేట్ పాఠశాలల్లో 100 శాతం ఫలితాలు సాధించినవి 1 ఉండగా, ఆశ్రమ పాఠశాలల్లో 1, బిసి గురుకుల పాఠశాలలు 13, ప్రభుత్వ పాఠశాల లు 3, కేజీబీవీ పాఠశాలలో 10, మోడల్ స్కూల్లో 4, మైనార్టీ గురుకుల పాఠశాలలు 4, సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు 8, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 6, జడ్పీ స్కూల్లు 84, ప్రైవేటు స్కూల్లు 97ఉన్నాయి. జిల్లాలో 100శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలు 101 కాగా ప్రభుత్వ పాఠశాలల్లో 10 జిపిఎస్ సాధించిన విద్యార్థులు 13 మంది ఉన్నారు. శాలిగౌరారం, చిట్యాల, మిర్యాలగూడ, తిరుమలగిరి, అనుముల, మండలాలకు చెందిన విద్యార్థులు 10 జిపిఎస్ సాధించారు.

 

సత్తా చాటిన గురుకులాలు….

పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని గురుకులాలు సత్తా చాటాయి. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నల్గొండ రీజియన్ పరిధిలో 99.45 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 19 మంది 10 జీపీఏ సాదించారు. నల్గొండ జిల్లాలో 837 మంది హాజరుకాగా 834 మంది 99.64 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 99.64 శాతం 7గురు 10జీపీఏ సాదించారు. సూర్యాపేట జిల్లాలో 608 మందికి 605, మంది 99.67శాతం ఉత్తీర్ణత సాధించాగా.. 9 మంది 10జీపీఏ సాదించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 543 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 537 మంది 98.90శాతం ఉత్తీర్ణత, 3 గురు 10 జీపీఏ సాధించారు.

బీసీ గురుకులాలలో…

మహాత్మాజ్యోతిబాపులే వెనకబడిన తరగతుల గురుకులాల్లో 99. 69 శాతం పలితాలు సాధించారు. మొత్తం విద్యార్థుల్లో 51 మందికి 10 జీపీఏ వచ్చింది. నల్గొండ జిల్లాలో 1056 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 1055 మంది ఉత్తీర్ణత సాధించారు. 37 మంది 10జీపీఏ సాదించారు. సూర్యాపేట జిల్లాలో 567 మంది పరీక్షకు హాజరుతాగా 565 మంది 99.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. 13 మంది 10 జీపీఏ సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 298 మంది పరీక్షకు హాజరు 295 98.99శాతం మంది ఉత్తీ ర్ణత సాధించగా ఒకరు 10 జీపీఏ సాధించారు.

గిరిజన గురుకులాలలో….

గిరిజన గురుకులాల్లో.. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని గిరిజన గురురు లాల్లో 98.87 శాతం ఉత్తీర్ణత సాధించారు. 10 మంది 10 జీపీఏ సాధించారు. నల్గొండ జిల్లాలో 632 మంది పరీక్షకు హాజరుకాగా 628 99.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. 7 గురు 10జీపీఏ సాధించారు. సూర్యాపేట జిల్లాలో 168 మంది హాజరుకాగా 143, 97.02 శాతం ఉత్తీర్ణత, ఇద్దరు 10 జీపీఏ సాధించారు. రీజియన్ పరిధిలోని 10 గురుకులాల్లో నూరు శాతం పలితాలు సాదించాయని గిరిజన గురుకులాల ప్రాంతీయ సమన్వయాధికారి కె. లక్ష్మయ తెలిపారు.

జూన్ 3 నుంచి సప్లిమెంటరీ..

జాన్ 3 నుంచి 13 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సప్లి మెంటరీ పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్షలకు సమయం తక్కు నగా ఉన్నందున రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలకు ఎదురుచూడకుండా జూన్ లో నిర్వహించే పరీక్షలను సద్వినియోగం చేసు కోవాలని సూచించారు. సందేహాలుంటే కౌంటింగ్ కోసం విద్యార్థులు సబ్జెక్టుకు రూ. 500 చొప్పున 15 రోజుల్లో ఎస్బీఐలో చలానా తీసి కార్యాలయానికి పంపాల్సి ఉంటుందని వెల్లడించారు.

జవాబు పత్రాలకు ఇలా..

రీవెరిఫికేషన్, జవాబు పత్రాలు పొందాల నుకునేవారు దరఖాస్తు పారాలకు సంబంధిత ప్రదానోపాధ్యాయులతో ధ్రువీకరించుకొని హాల్ టికెట్ జిరాక్స్ తో పాటు జిల్లా విద్యాశాఖాదికారి కార్యాల యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో సమర్పించాలి. రూ.1000 చొప్పున చలానా తీయాల్సి ఉంటుంది. వివరాలకు సంబంధిత ప్రధానోపాధ్యాయులను సంప్రదించాల్సి ఉంటుంది. ఇందుకు 15 రోజుల గడువు విధించారు.

SSC Results in Nalgonda