Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Storage seeds: వానకాలం పంటకు సరిపడ విత్తన నిల్వలు

నల్లగొండ జిల్లాలో ఈ వానాకాలం పంటకు సంబంధించి విత్తన నిల్వలు సరి పడా ఉన్నాయని, రైతులు ఎంత మాత్రం ఆందోళన చెందొద్దని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నా రు.

గత ఏడాది కంటే ఈ ఏడాది విత్త న నిల్వలు అధికంగా ఉన్నాయి
రైతులు ఎంత మాత్రం ఆందోళన చెందవద్దు
నకిలీ విత్తనాలు అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తప్పవు
మీడియా సమావేశంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన

ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ(Nalgonda) జిల్లాలో ఈ వానాకాలం పంటకు సంబంధించి విత్తన నిల్వలు సరి పడా ఉన్నాయని, రైతులు ఎంత మాత్రం ఆందోళన చెందొద్దని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన(Dasari Harichandana) అన్నా రు. శుక్రవారం నల్లగొండ జిల్లా కలె క్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారు లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాలలో సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎటు వంటి కొరత లేదని, రైతులు(Farmers) ఆందో ళన చెందాల్సిన అవసరం లేద న్నారు.జిల్లాలో లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద మాత్రమే ప్యాకేజీ లో ఉన్న విత్తనాలు కొనుగోలు చేయాలని, ఒకవేళ లూజ్ విత్తనాలు అమ్ము తున్నట్లు దృష్టికి వస్తే అధికారులకు తెలియజేయాలని కోరారు.

ఇందు కోసం హెల్ప్ లైన్ నెంబర్(Help line no)ని ఏర్పా టు చేశామని ఎక్కడైనా నకిలీ విత్త నాలు అమ్ముతున్నట్లు తెలిస్తే హెల్ప్ లైన్ నెంబర్. 7288800023 కి ఫోన్ చేసి తెలపాలని కోరారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి, నకిలీ విత్తనాలు అమ్మే వాళ్లపై ఉక్కు పాదం మోపడానికి క్షేత్రస్థా యిలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధి కారులతో కూడిన టీం లను ఏర్పా టు చేశామని తెలిపారు. ఆథరైజ్డ్ డీలర్ల వద్ద కాకుండా బయట విత్త నాలు కొని రైతులు మోసపోవద్దని కోరారు. ఒకవేళ ఏ డీలర్ అయినా రైతులను తప్పుదోవ పట్టించిన, లూజు విత్తనాలు అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఇప్పటికే తమ టీమ్స్ ద్వారా మిర్యాలగూడ, శాలిగౌరా రం మండలాల్లో నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై పిడి యాక్ట్(PD Act) నమోదు చేసి విత్తనాలను సీజ్ చేశామని తెలిపారు.

గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ విత్తన నిల్వలు ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని మండలాలలో 941 అవుట్లెట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, విత్తనాలు అవసరమైన రైతులు ఈ ఔట్లెట్ల ద్వారా మాత్రమే కొనాలని తెలిపారు .ప్రభుత్వ ఆధ్వర్యంలో జీలుగా విత్తనాలను 30 కిలోలు1116/- రూపాయలకు, పిల్లి పెసర 40 కిలోలు 1084 /- రూపాయలు,పత్తి విత్తనాలు 475 గ్రాములు 864/- రూపాయల చొప్పున అమ్ముతున్నట్లు ఆమె తెలిపారు. ఈ మీడియా సమా వేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్రరావు,(Collector Purnachandra Rao)జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, సమాచార శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Storage seeds full for farmers