SP Chandana Deepti: రహదారుల మీద వాహనాలు నిలిపితే కఠిన చర్యలు
రహదారుల మీద వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటాం.
ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యాన్ని చేరాలి
జిల్లా ఎస్పీ చందనా దీప్తి
ప్రజా దీవెన నల్గొండ క్రైమ్: రహదారుల మీద వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటాం.వాహనదారులు అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు(Vehicles) నడుపుతూ అనేక ప్రమాదాలకు గురి అవుతున్నారని, వాహనాలు నడిపే సమయంలో తమ ప్రాణాలనే కాకుండా తమపై ఆధారపడి కుటుంబ సభ్యులను దృష్టిలో వుంచుకొని వాహనాలను నడుపుతూ సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు.
ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రోడ్డుపై(Road)అడుగు పెడితే చాలు ప్రమాదంsp రూపంలో ముంచుకు వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్నదని, చిన్న నిర్లక్ష్యం సైతం భారీ మూల్యానికి దారి తీస్తుందని సుఖవంతమైన ప్రయాణానికి, వేగంగా గమ్యస్థానానికి చేర్చే వాహనాలు ప్రాణాలను సైతం గాల్లో దీపాల్లా మార్చేస్తున్నాయని అన్నారు. ప్రమాదాల(Accidents) నివారణకు, ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయట పడేందుకు ఏర్పాటు చేసిన సాంకేతిక, రక్షణ వ్యవస్థలను సైతం వాహన చోదకులు తేలిగ్గా తీసుకోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అన్నారు.
వాహనదారులు వాహన వేగం నిర్ణీత వేగం తగ్గించి నడపడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. డ్రంకెన్‌డ్రైవ్, అతివేగం, మొబైల్ ఉపయోగిస్తూ డ్రైవింగ్, సీట్ బెల్ట్(Seat belt) లేకుండా ప్రయాణించుట లాంటి సమయంలో రోడ్డు ప్రమాదం సంబవిస్తే అధిక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. ఎండాకాలం సమయంలో బారి వాహనాలు నడిపే వాహనచోదకులు ఎక్కువ దూరం పోవాల్సి వచ్చినప్పుడు కొంత సమయం సేదా తీర్చుకొనేందుకు రహదారులకు మీద వాహనాలు నిలుపుతున్నారు అని, అలా నిలపడం వల్ల ప్రమాదాల జరుగుతున్నాయని, రోడ్డు మీద వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరాలని సూచించారు.
Strict action vehicles parked on roads