Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Banda Srisailam: డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ఆమోదం కోసం పోరాటం

–సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

Banda Srisailam: ప్రజా దీవెన, చండూర్: నల్లగొండ జిల్లాలో నిత్యం కరువు కాటకాలకు గురవుతూ ఫ్లోరైడ్ (Fluoride) ప్రాంతాలైన మునుగోడు దేవరకొండ నియోజక వర్గాలకు సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను వెంటనే ఆమోదించి సాగునీరు అందించే వరకు మా పోరాటం ఆగదు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం అన్నారు. బుధవారం చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలో డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించాలని సంతకాల సేకరణకార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2016లో జీవో ఎం ఎస్ నెంబర్ 107 ద్వారా అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకానికి రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజులలో, 30 టీఎంసీల నీరు జిల్లాలోని సింగరాజుపల్లి గొట్టిముక్కుల, చింతపల్లి, లక్ష్మణాపురం శివన్న గూడెం రిజర్వాయర్లు నింపి సాగునీరు అందించడం ద్వారా ఈ మునుగోడు దేవరకొండ ప్రాంతాలను వ్యవసాయ రంగానికి నీరు అందించి అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ రిజర్వాయర్లకు సంబంధించిన పనులు కొంతమేరకు జరిగిన., కీలకమైన డిపిఆర్ (DPR) ను ఆమోదించకపోవడం అట్లాగే సుమారు 27 కిలోమీటర్ల కాలువని తవ్వే పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల కోసం లేఖలు రాయకపోవడం ద్వారా ఆ ప్రభుత్వం తీవ్రమైన తప్పిదానికి పాల్పడిందని విమర్శించారు.

మునుగోడు, దేవరకొండ ప్రాజెక్టులకుపర్యావరణ అనుమతులు, అటవీ శాఖ (Forest Department) అనుమతులుఇవ్వాలని., పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తరహా మా ప్రాంతాల కూడా అన్ని అనుమతులు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిండి ఎత్తిపోతల పథకానికి డిపిఆర్ ఆమోదింపజేసి అధిక నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు సిపిఎం (CPM) దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు.

మా ప్రాంతాలకు సాగునీరు త్రాగునీరు అందించే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, సిపి్యం బోడంగిపర్తి గ్రామశాఖకార్యదర్శి గౌసియా బేగం, ఎస్. కే జానీపాషా, లతీఫ్, కే.స్వామి, ఖాసీసిముని, యాదయ్య, లింగయ్య
తదితరులు పాల్గొన్నారు.