Sun Stroke: వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్త చర్యలు
వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన కోరారు.
నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు(High Temperature) రికార్డు అవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన(Collector Dasari Harichandana) కోరారు. వడదెబ్బ తగలకుండా తీసుకో వాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై జిల్లా ప్రజలలో అవగాహన కల్పించేం దుకుగాను, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండలరావు స్వయంగా రచించి, రూపొందించి, గానం చేసిన ఆడియో పాటల సిడిని ఆమె గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆవిష్కరించారు.
ఆడియో సిడి ఆవిష్కరణ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని, వేడి గాలులు సైతం వీస్తున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వడదెబ్బకు(Sun stroke)గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.నీరసంగా అనిపించడం, ఒళ్లంతా వేడి కావడం, తలనొప్పి, వాంతులు, విరేచనాల వంటి లక్షణాలు కనబడితే తక్షణమే చక్కర, ఉప్పు ద్రావణాన్ని తాగాలని, ఆ వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ కు చూయించుకోవాలని తెలిపారు.
అంతేకాక ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, అత్యవసరమై బయటకు వెళ్ళవలసి వస్తే వదులు దుస్తులు, లేత, పల్చటి దుస్తులు ధరించాలని, నిలువ ఉంచిన ఆహారం తినకూడదని, మాంసాహారం తినకుండా చూసుకోవాలని, ద్రవపదార్థాలు, పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలని ఆమె తెలిపారు. జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామస్థాయి వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో ఓ ఆర్ ఎస్(ORS)పాకెట్లను సిద్ధంగా ఉంచడం జరిగిందని, ఏఎన్ఎం, ఆశాల వద్ద సైతం ఓ ఆర్ ఎస్ పాకెట్లు ఉన్నాయని ,జిల్లాలో 5 లక్షల ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
అంతేకాక వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాచారాన్ని సైతం సిద్ధంగా ఉంచామని తెలిపారు. మే 13న లోక సభ ఎన్నికల పోలింగ్(Election polling)జరుగుతున్న దృష్ట్యా ఓటర్లు వడదెబ్బకు గురికాకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీటితో పాటు, ఓ ఆర్ఎస్ పాకెట్లను సైతం ఏర్పాటు చేయడం జరిగిందని, నీడ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
ప్రజలు ముందు జాగ్రత్త గా వడదెబ్బ నుండి కాపాడుకునేం దుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కొండలరావు తానే స్వయంగా రచించి, గానం చేసి ప్రజలలో చైతన్యం నింపడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండలరావు, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు ,వెంకటేశ్వర్లు, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఫీల్ పబ్లిసిటీ ఆఫీసర్ కోటేశ్వరరావు, ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఘన శ్యామ్, వైస్ ప్రిన్సిపల్ తదితరులు ఉన్నారు.
Sun stroke precautions in summer