Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sundaraiah Centering Society: సుందరయ్య సెంట్రింగ్ సొసైటీ నూతన కమిటీ ఎన్నిక

Sundaraiah Centering Society: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: శ్రీ సుందరయ్య బిల్డింగ్ కాంట్రాక్ట్ సెంట్రింగ్ తాపీ వర్కర్స్ కోపరేటివ్ లిమిటెడ్ సొసైటీ(Sundarayya Centering Society) ఎన్నికల్లో అధ్య క్షుడిగా నోముల యాదయ్య ఉపా ధ్యక్షులుగా చిన్నబత్తిని జయ ప్రకాష్, కార్యదర్శిగా దేవరంపల్లి రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి (Ram Reddy Venkat Reddy) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం సుందరయ్య భవన్లో కోపరేటివ్ ఎన్నికల అధికారి కె జ్యోతి సమక్షంలో ఎన్నికలు నిర్వ హించడం జరిగింది. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 13 నుండి 19 వరకు నామి నేషన్లు ,20 న పరిశీలన 21న ఉపసంహరణ, అనంతరం 9 మంది డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అం దులోనుండి సోమవారం అధ్య క్షులు గా నోములు యాదయ్య, ఉపాధ్యక్షులు చిన్న బత్తిని జయప్రకాష్ ,కార్యదర్శి దేవరంపల్లి రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి, డైరెక్టర్లుగా జక్కలి సత్తయ్య, బత్తుల రవి, బొజ్జ సైదులు, పానుగంటి నాగరాజు, రాసమల్ల సైదులు, మన్నె శంకరయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్ని కైన అధ్యక్ష, కార్యదర్శులు నోముల యాదయ్య, దేవరంపల్లి వెంకట్ రెడ్డి లు మాట్లాడుతూ భవన ని ర్మాణ రంగంలో పనిచేస్తున్న సెం ట్రింగ్ మేస్త్రీలకు కార్మికులకు ప్రభు త్వం నుండి రావలసిన సంక్షే మ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని అన్నారు.

ఈ పదవిని బాధ్యతాయుతంగా నిష్పక్షపాతం గా కార్మికులకు సేవ (Service to workers)చేస్తామని తెలి పారు. ఎన్నుకున్న కార్మికులకు, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహించిన కోపరేటివ్ అధికా రులకు నిత్యం మా వెంట ఉంటు న్న సిఐటియు నాయకులకు ధన్య వాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, సుందరయ్య సొసైటీ సీనియర్ నాయకులు బిరుదొజు రామాచారి, పాక మల్లయ్య, బచ్చలకూరి గురువయ్య, సభ్యులు చిత్రం అంతయ్య, బొమ్మ మల్లేష్ ముత్యాల చారి తదితరులు పాల్గొన్నారు.