ప్రజాదీవెన, నల్గొండ టౌన్: భారత ఆహార సంస్థ, ఉమ్మడి నల్గొండ జిల్లా డివిజనల్ మేనేజర్ గా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి బదిలీపై వచ్చిన సువీన్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సెప్టెంబర్ నెల నుండి ఇన్చార్జి డివిజనల్ మేనేజర్ గా వ్యవహరిస్తున్న హీరా సింగ్ రావత్ నుండి బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
కాగా, సువిన్ గతంలో కొద్దికాలం పాటు జిల్లా ఇన్చార్జి డివిజనల్ మేనేజర్ గా పనిచేశారు. సంస్థ ఏజి ఎం (QC), డా. రాఘవేంద్ర సింగ్, ఇతర సీనియర్ అధికారులు నూతన డి ఎం కు సాదరంగా స్వాగతం పలికారు.