Swaroopa rani: ప్రజా దీవెన, మునుగోడు: నల్లగొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమా వేశం (General Assembly of Nalgonda Zilla Parishad)శనివారం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు. స మావేశంలో పాల్గొన్న జిల్లా సాంఘి క సంక్షేమ స్థాయి సంఘం చైర్మన్ మునుగోడు జడ్పిటిసి నారా బోయిన స్వరూప రాణి (Swaroopa rani) రవి ముది రాజ్ మునుగోడు మండలంలోని పలు సమస్యలను లేవనెత్తారు. మును గోడు మండలం లోని మునుగోడు కొరటికల్ , చోల్లేడు ఊకోండి గ్రామాలలో ఎలక్ట్రికల్ ఓల్టేజి సమస్య అధికంగా సమస్య ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Komati Reddy Venkata Reddy) దృష్టికి తీసుకువెళ్లారు, అదే విధంగా మునుగోడు మండల కేంద్రంలో వాగు భూమిని కొంత మంది ఆక్రమించుకున్నారని సభా దృష్టికి తీసుకొచ్చారు.
మంత్రి కోమటిరెడ్డి (Komati Reddy Venkata Reddy) వెంటనే కలెక్టర్ ని ఆ విషయం గురించి ఎంక్వయిరీ చేయమని ప్రభుత్వ భూమిని కబ్జా కాకుండా చూడమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలెక్టర్ ను కోరారు. శిధి లావస్థలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ బా లుర వసతి గృహాన్ని కూల్చివేసి నూతన భవనాన్ని (new building)నిర్మించాలని కోరారు. మునుగోడు లోని గురు కుల పాఠశాల పక్కా భవన నిర్మాణం కొరకు సర్వేనెంబర్ 10 లో గల ప్రభుత్వ భూమిని కేటా యించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా మునుగోడు మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ అసంపూర్తిగా ఉన్నందున డ్రైనేజీలని (Drainages) పూర్తి చేయాలని కోరారు, మునుగోడు మండలంలోనూతన గ్రామపం చాయతీలపక్కా భవన నిర్మాణాలు నిర్మించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు జడ్పిటిసిలు జిల్లా అధికారులు పాల్గొన్నారు.