Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

T. Poorna Chandra: సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిని కొనసాగించాలి

–నల్లగొండ స్థానిక సంస్థల అద నపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర

T Poorna Chandra:ప్రజా దీవెన, నల్లగొండ: సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిని అందరూ కోసాగించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర (T. Poorna Chandra)అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న (Sardar Sarvai Papanna)జయంతిని పురస్కరించు కొని ఆదివారం అయన జిల్లా కలెక్టర్ కార్యాల యంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న Sardar Sarvai Papanna)జయంతి వేడుక లలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళు లర్పించారు.అతి సామాన్య కుటుం బంలో పుట్టి కుల వృత్రిని చేసుకుం టూ ఆనాడు కొంతమంది బడు గు,బలహీన వర్గాల పై చేసే అరాచకాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడిన సాహస వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు.

తన శక్తి యుక్తులతో వీర సైనికుడులా మారి ఒక శక్తిగా ఎదిగి అన్యాయాలు,అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత సర్వాయి పాపన్నది అని అన్నా రు. తన సైన్యంతో అప్పటి ప్రభుత్వాలను గడగడలాడించా రని,20 దుర్గాలను జయించార న్నారు.సర్వాయి పాపన్న చక్రవ ర్తులు, రాజులు, సైన్యాల కుటుం బంలో (Emperors, Kings, Armies Kutum Bum) పుట్టలేద ని ,మాములు కుటుంబంలో పుట్టి సామ్రాజ్యాన్ని స్థాపించి రాజై కీర్తి ప్రతిష్టలు పొందారని,అంతేకాక విదేశీ దండయాత్రలు సైతం ఎదుర్కొని నిలబడి తన సామ్రా జ్యాన్ని పటిష్టం చేశాడని అన్నారు. అలాంటి సాహస వీరుడిని ఆదర్శం గా తీసు కుని ముందుకెళ్లాలని అన్నారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్ , గౌడ సంఘం ,బి సి సంఘా ల నాయకులు, తదితరులు పా ల్గొన్నారు.

కల్లుగీత కార్మిక సంఘం (Kallugeeta Labor Union) జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న, ప్రధానకార్యాదర్శి సీతారాములు, గౌడ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యద ర్శులు నకిరేకంటి కాశయ్య గౌడ్, ఎరుకల శంకర్ గౌడ్, మారయ్య గౌడ్, కల్లూరి సత్యనారాయణ గౌడ్, శ చక్రహరి రామరాజు, బి.సి. సం ఘం అధ్యక్షులు, శ్రీ దుడుకు లక్ష్మీ నారాయణ, బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షులు, మిర్యాల యాదగిరి, గుండు వెంకటేశ్వర్లు, వి.నారాయ ణ, కర్నాటి యాదగిరి, శ్రీ నెలపట్ల సత్యనారాయణ గారు పవనగుండ్ల అచ్చాలు, పాలడుగు నాగార్జున, రవీంద్రకుమార్, పందుల సైదులు గౌడ్, ఉప్పలగోపాల్, బిసి. సంఘ నాయకులు ఇతర ప్రముఖులు, వివిధ కుల సంఘ నాయకులు మరియు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.