fake certificates: నకిలీ ధ్రువీకరణ పత్రాలతోరుణాలు
అమాయకుల ఆధార్ కార్డులను సేకరించి వాటిలో చిరునామా మార్చడంతోపాటు వారి పేరిట తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుం చి రుణాలు పొందుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి శనివారం తెలి పారు.
అమాయక ప్రజలే ఆధార్ కార్డులు వాడుకున్న నిందితులు
ముగ్గురు నిందితుల అరెస్ట్ రిమాం డ్ కు తరలింపు
నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి వెల్లడి
ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: అమాయకుల ఆధార్ కార్డులను సేకరించి వాటిలో చిరునామా మార్చడంతోపాటు వారి పేరిట తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుం చి రుణాలు పొందుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి(SP Chandana Deepti) శనివారం తెలి పారు. నిందితుల నుంచి 27 ఆధార్ కార్డులు, రూ.1,32,600 నగదు, 44 సెల్ ఫోన్ లు, రెండు కార్లు, 83 పాన్ కార్డు లు , 18 సిమ్కార్డులు, 92 డెబిట్, క్రెడిట్ కార్డులు, 64 రబ్బర్ స్టాంపులు, 3 ల్యాప్ ట్యాప్ లు, కలర్ ప్రింటర్, 9 బోగస్ సంస్థల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
శనివారం జిల్లా కేంద్రం లో ని ఎస్సీ కార్యాలయంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం కురుమ ర్తి గ్రామానికి చెందిన కాశమల్ల క్రాం తికుమార్(Kasamalla Kram Tikumar)హైదరాబాద్ లో సొంతం గా సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టి నష్టాలు రావడంతో మూసేశాడు. అదే కంపె నీలో పనిచేసిన సిలివేరు సతీష్ కలిసి సంపాదించాలనే దురుద్దేశం తో కొత్త దందాకు తెరలేపారు. సతీ ష్ బాబాయి కాశ మల్ల నాగరాజుకు తెలిసిన, చదువురాని అమా యకు ల ఆధార్ కార్డులు(Aadhaar cards)తెప్పించుకు న్నా రు. వారికి కొంత డబ్బు ఇస్తామ న్నారు. ఆధార్ కార్డులో ఫొటోషాప్లో చిరునామాలను మార్చారు. వారి ఆధార్ కార్డులు, పాన్ కార్డు లు తీసుకున్నారు.
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆధార్, ఏటీ ఎం కార్డులు, లాప్ టాప్ తదితరా లు ఫోన్ నంబర్లను లింక్ చేసేందు కు కొత్త సిమ్ కార్డులు తీసుకున్నా రు. వాటితో వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి పాసు పుస్తకాలు, చెక్ బుక్లు, ఏటీఎం కార్డులు(ATM cards)తీసు కుని వారి వద్దనే ఉంచుకున్నారు. తప్పుడు పత్రాలు సృష్టించి వీరంతా హైదరాబాద్లో ఉద్యోగస్తులని, వారి ఆదాయం అధికంగా చూపేందుకు కొన్ని లావాదే వీలు జరిపి సిబిల్ స్కోర్(Sybil Score)పెరిగాక రుణాలు తీసు కు న్నారు. క్రెడిట్ కార్డులూ తీసుకుని జల్సాలు చేశారు. బ్యాంకులకు తిరిగి సొమ్ము కట్టలేదు. దుప్పల పల్లికి చెందిన ఓ యువకుడు ఇచ్చిన సమాచారంతో నల్లగొండ పట్టణం చైతన్యపురి కాలనీకి చెందిన కాశమల్ల నాగరాజు, హైద రాబాద్ మణికొండలోని మాదాపూ ర్కు చెందిన ఆఫ్ సాఫ్ట్ ఐటీ సొల్యూషన్స్ సీఈవో కాశమల్ల క్రాంతి, అదే కంపెనీకి చెందిన ఉద్యోగి సతీష్ను ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.
take loan with fake certificates