Chandrababu naidu oath: బాబు ప్రమాణ స్వీకారంతో సంబరాలు
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రoలో టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి.
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఆంద్రప్రదేశ్(Andhra Pradesh chief Minister) ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu take oath)ప్రమాణ స్వీకారం సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రoలో టిడిపి శ్రేణులు (TDP Workers)సంబరాలు జరుపుకున్నాయి. బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే నల్లగొం డ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ(Telugu desam party workers) నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని సం తోషం వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగా పలువురికి తెలు గుదేశం పార్టీ తరఫున మిఠాయిలు పంచా రు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులని పేర్కొన్నారు.
చంద్రబాబు హయాంలోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, ఏపీలో పరిశ్రమలు ఉద్యోగాలు పెద్ద ఎత్తున వచ్చి అక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని ఆశాభా వం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రజలు బతుకులు మారుతాయని, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బాబు రావాలని ప్రజలందరూ కోరుకోవడం వల్లే ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మక విజయం దక్కిందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ(Telugu desam party) తెలంగాణలో సైతం పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎల్వి యాదవ్, ఆకునూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
TDP workers Celebrations chandrababu naidu take oath