Teej festival:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో (Under SC ST Cell) బంజారా విద్యార్థులు తీజ్ పండుగను (Teej festival) ఘనంగా జరుపుకు న్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి మాట్లాడుతూ ప్లీజ్ లాంటి ఉత్స వాలు సంస్కృతి సాంప్రదాయా లకు, పర్యావరణహిత జీవనానికి ప్రతీకలని అన్నారు. శ్రావణ మా సంలో 9 రోజులు జరుపుకునే ఉత్సవాల్లో యువతులు తమ సాంప్రదాయక పద్ధతుల్లో కుటుం బాలు, ఆవాసాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తారు.
గోధుమ గడ్డి మొలకలు (Wheat grass sprouts) అందుకు ప్రతీకగా భావించి చివరి రోజు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ మద్దిలేటి మాట్లా డుతూ భిన్నత్వాలకు ఆలవా లమైన భారత దేశంలో ప్రతి ఒక్కరూ వారి పద్ధతుల్లో సర్వ మానవాళి శ్రేయస్సు మరియు పర్యావరణహిత (Environmentally friendly) జీవితానికి సాంప్రదాయకంగా బద్ధులమై ఉన్నామనే చిహ్నాలుగా తీజ్ ను కొనియాడారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంప్రదాయక ఆరాధన కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంప్రదాయక నృత్యాలు (Traditional dances)_ఎంతగానో అలరించాయి.
ఈ కార్యక్రమంలో ఆచార్య అల్వాల రవి, డా మద్దిలేటి, డా మారం వెంకటరమణారెడ్డి, డా రామావత్ మురళి. విద్యార్థులు రవీందర్, సురేష్, శ్రీధర్, అజేష్, శ్రేయ, మేఘమాల, రమాదేవి, అనసూయ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.