Dasari Harichandana: వృద్ధురాలికి న్యాయం చేసిన కలెక్టర్
తమ సమస్యను చెప్పుకున్న ఓ వృద్ధురాలికి జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి(Harichandana Dasari)న్యాయం చేశారు. వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా కేంద్రం లోని బొట్టుగూడలో సుకారం లక్ష్మమ్మ భర్త నరసింహులు రిటైర్డ్ పోలీస్ ఉద్యోగి, 95 సంవత్సరాల కల్గిన వయోవృద్ధురాలు నివాసం ఉంటుంది.
ప్రజా దీవెన నల్గొండ: తమ సమస్యను చెప్పుకున్న ఓ వృద్ధురాలికి జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి(Harichandana Dasari)న్యాయం చేశారు. వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా కేంద్రం లోని బొట్టుగూడలో సుకారం లక్ష్మమ్మ భర్త నరసింహులు రిటైర్డ్ పోలీస్ ఉద్యోగి, 95 సంవత్సరాల కల్గిన వయోవృద్ధురాలు నివాసం ఉంటుంది. సుకారం లక్ష్మమ్మకు(Sukaram Lakshmamma) నలుగురు కుమారులు ఉన్నారు. అయితే లక్ష్మమ్మ వద్ద ఉన్న 10 తులాల బంగారం ను తన కుమారులు తీసుకొని తనను వేధింపులకు గురి చేస్తున్నారని లక్ష్మమ్మ శుక్రవారం జిల్లా కలెక్టర్ హరిచందన దాసరికి ఫిర్యాదు చేసింది.
విషయంపై స్పందించిన జిల్లా కలెక్టర్ హరిచంద దాసరి వృద్ధురాలికి(Old Women) న్యాయం చేయాలని ఐసిడిఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి,(Munagala Nagireddy)నల్లగొండ సిడిపిఓ నిర్మల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి లో పరిశీలించి గ్రామ పెద్దలు, కాలనీవాసులు, కుటుంబ సభ్యులకి కౌన్సిలింగ్ నిర్వహించి లక్ష్మమ్మ నుండి తీసుకున్న బంగారo ఆభరణాలను తిరిగి ఇప్పించారు. ఈ కార్యక్రమంలో సునీల్, రామకృష్ణ, అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
The collector did justice to the old woman