–మాటల్లోనే ఆర్భాటం చేతల్లో శూన్యం
–సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
Thummala Veera Reddy:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కేంద్ర ప్రభుత్వం జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్ బడా కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని, కేంద్ర ప్రభుత్వం మాటల్లో ఆర్భాటం తప్ప చేతల్లో శూన్యమేనని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి (Thummala Veera Reddy) అన్నారు. బుధవారం సిఐటియు నల్గొండ జిల్లా కమిటీ సమావేశం దొడ్డి కొమురయ్య భవన్లో జరిగింది ఈ సందర్భంగా వీరారెడ్డి (Thummala Veera Reddy) మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక కార్పొరేట్ వ్యాపార అనుకూల బడ్జెట్ ఇది అని విమర్శించారు. ఉపాధి, ప్రజా సంక్షేమం, అభివృద్ధి అంటూ ఆర్భాటంగా మాటల్లో గొప్పలు చెప్పుతూ ఆచరణలో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం (Central Govt)ప్రవేశపెట్టిన బడ్జెట్ ని ఒకసారి పరిశీలిస్తే రెవిన్యూ దాదాపు 15% పెరిగిన ఖర్చు ఆరు శాతం కూడా లేదని అన్నారు. కనీవిని ఎరగని రీతిలో నిరుద్యోగం, ఆహార ద్రవయోల్బణం రేటు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే ఈ బడ్జెట్ వల్ల లాభపడింది బడా వ్యాపార వర్గాలేనని విమర్శించారు. దుర్భర దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్న పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను వేటిని ఈ బడ్జెట్ పరిష్కరించలేదని అన్నారు. వివిధ రకాల రాయితీల పేరుతో ప్రభుత్వ నిధులు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల జేబుల్లోకి వెళ్లేలా చేశారని ఆరోపించారు. మహిళా శిశు సంక్షేమ అభివృద్ధికి కేవలం 2.5% పెరిగాయని, ఉపాధి హామీ గ్రామీణ అభివృద్ధి శాఖ కేటాయింపులు ఏమాత్రం పెంచలేదని అన్నారు. కార్మిక సంక్షేమ నిధి(Labor Welfare Fund)లో కోత విధించాలని ఆరోపించారు. ఏ రంగం చూసిన నిధుల కేటాయింపు అరకొరగానే ఉన్నాయని అన్నారు. ఇంధన పరివర్తన ద్వారా ఇంధన భద్రతకు చర్యలు తీసుకోవడం అంటే యుహాత్మకంక ఇందన రంగాన్ని ప్రైవేటీకరించడానికి చేపట్టిన చర్య అని విమర్శించారు. కార్మిక వర్గ తిరోగమన చర్యలతో కూడిన ఈ బడ్జెట్ ను నిరసిస్తూ ఆందోళన, నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారా యణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ , జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం , జిల్లా సహాయ కార్యదర్శిలు దండెంపల్లి సత్తయ్య, మల్లు గౌతమ్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పెంజర్ల సైదులు, పోలే సత్యనారాయణ, సలివోజు సైదాచారి, సులోచన, బొంగురాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు