Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Thummala Veera Reddy: జిల్లా సమగ్రాభివృద్ధికై సిపిఎం పోరాటాలు ఉదృతం

–నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి

ప్రజా దీవెన నల్లగొండ టౌన్:నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా తిన పూర్తి చేయాలని డిండి ఎత్తిపోతల ఎస్ఎల్బీసి త్వరగా పూర్తిచేసి లక్షలాది ఎకరాలను సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. పాలకులు మారిన ప్రభుత్వాలు మారిన పేదల బతుకులు మారడం లేదని దోపిడి గురయ్యేవాడు ఉన్నంతకాలం పాలకులు పేదవాడిని దోచుకుంటూనే ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం లాగానే మాటలు చెబుతూ కాలం వెళ్ళ తీస్తున్నారు తప్ప మాటలు కోటలు దాటుతున్న ఆచరణ గడప దాటడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మంగళ వారం దొడ్డి కొమరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్య దర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లా డుతూ ఈ బడ్జెట్ సమావేశంలో నల్గొండ జిల్లా సమగ్ర అభివృద్ధికై పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయు టకై తక్షణమే బడ్జెట్ కేటాయిం చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా నన్న ఇందిరమ్మ ఇళ్లపై స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉంటే సంవ త్సరం పాలన సాధించిన విజ యాలని సంబరాలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజావిజయోత్సవ సభలో మం త్రులు ఇచ్చిన మాట కు కట్టుబడి ఉండాలని అన్నారు. గత ప్రభు త్వం లాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా సమస్యల పైన పోరాటం చేసే వారిపై అక్రమ కేసులు అరెస్టు చేసి న చేయడం ఏమిటని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో వరుసగా విద్యా సంస్థలో ఫుడ్ పాయిజన్ అవుతుం టే కంటితుడుపు చర్యలాగ కింది స్థాయి ఉద్యోగులపై కొరడా జుల్పి స్తున్నారు తప్పటెండర్లు వేసే నాణ్య తలేని సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాకుండా శాశ్వత పరిష్కారం చూపడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చిన హామీలు అమలు చేయాలని లేని పక్షంలో ప్రజల తరఫున పోరాటాలకు సిపిఎం పార్టీ ముందుంటుందని అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు నెంబర్స్మెంటు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చేలగాటం ఆడుతున్నదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి మార్పు కావాలే అని చెప్పిన మాటలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. తక్షణమే రైతుబంధు నిధులు విడుదల చేయాలని అన్నారు. రాష్ట్రంలో హామీలు అమలు చేయకుంటే పెద్ద ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని ba సందర్భంగా హెచ్చరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సాగునీరు త్రాగునీరు ప్రాజెక్టులపై దృష్టి సారించాలని అన్నారు. ఆశ వర్కర్లు తమ హక్కుల కోసం హైదరాబాదులో ఆందోళన చేస్తే

పోలీసులు ఇష్టం సారంగా వ్యవహరించి మహిళలన్నీ చూడకుండా బూతులు మాట్లాడుతూ కేసులు బనాయించడం జరిగింది. వెంటనే వారిపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ, కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకుంటూ పత్రికల్లో అవపడుతున్నారు తప్ప ప్రజా సమస్యలపై ఏ ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. పేదల పక్షాన కార్మికుల పక్షాన రైతుల పక్షాన నికరంగా నిజాయితీగా పోరాడే పార్టీ సిపిఎం అని ఉన్నారు. భవిష్యత్తులో పేద మధ్యతరగతి ప్రజల సమస్యల పరిష్కారం కోసం స్థానిక సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రజలందరినీ చైతన్యపరిచే బలమైన ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, బండ శ్రీశైలం, చిన్నపాక లక్ష్మీనారాయణ, పాలడుగు నాగార్జున పాలడుగు ప్రభావతి, కందాల ప్రమీల, వీరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.