–18 వేల కనీస వేతనానికి ఈ బడ్జె ట్ లోనే కేటాయింపులు చేయాలి
–సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
Thummala Veera Reddy:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆశాల వర్కర్స్ కు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి(Thummala Veera Reddy) డిమాండ్ (demnand) చేశారు. సోమవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ( సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, డి ఎం అండ్ హెచ్ ఓ లకు* వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాను ఉద్దేశించి వీరారెడ్డి మాట్లాడుతూ ఆశాలకు ఇచ్చిన హామీలను అమలు అమలు కోసం ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పెరు గుతున్న ధరలకు అనుగుణంగా ఫిక్స్ డ్ వేతనం 18 వేలు కు బడ్జెట్ నిర్ణయించే అమలు చేయాలని ఆయన కోరారు.
గతంలోఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్సూరెన్స్ (Insurance) 50 లక్షలు ఇవ్వాలని అదేవిధంగా మట్టి ఖర్చులకు 50వేలు చెల్లిస్తూ ప్రభుత్వం సర్కులర్ జారీ చేయాల నిఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ఎన్నికల విధులు నిర్వహించిన ఆశాలకు డబ్బులు వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆశాలకు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, రిటర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలు పరిష్కరించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన హామీని నెరవేర్చ లేదు అన్నారు. ఆశాలకు ఎగ్జామ్ పెట్టి నిర్ణయాన్ని రద్దు చేయా లని,ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే సర్కులర్ జారీ చేయా లన్నారు.
ఆశాలకు ప్రతి సంవ త్సరం 20 రోజుల వేతనంతో కూడిన క్యాజువల్ (casual leaves) సెలవులు ఇవ్వాలని అదేవిధంగా ఆరు నెలల వేతనంతో కూడిన మెడికల్ సెల వులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సిఐటియు (CITU)జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ ఆశ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి మహేశ్వరి,టి వెంకటమ్మలు మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న రిజిస్టర్ ను తొందరగా ప్రింట్ చేసి ఆశలకు అందించాలన్నారు. ఆశాలకు ఏఎన్ఎం, జిఎన్ఎమ్ (ANM, GNM) ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, టెన్త్, ఓపెన్ టెన్త్, ఇంటర్ ఓపెన్, ఇంటర్, డిగ్రీ, టెట్, గ్రూప్ 1,2 తదితర ఎగ్జామ్స్ సందర్భంగా ఆశాలకు వేస్తున్న డ్యూటీలకు డబ్బులు చెల్లించాలన్నారు. ఆశాలకు పారితోషకాల గైడ్ లైన్స్ కు భిన్నంగా ఏ ఎన్ సి తదితర టార్గెట్స్ ఎక్కువ కేసులు నమోదు చేయాలని ఆశాలను వేధింపులకు గురిచేస్తున్న జిల్లా అధికారుల పైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పై సమస్యల పరిష్కారానికి ఈనెల 30న జరిగే చలో హైదరాబాద్ ను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం,సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండం పెళ్లి సత్తయ్య,ఏర్పుల యాదయ్య,సిఐటియు జిల్లా నాయకులు అద్దంకి నరసింహ,పోలె సత్యనారాయణ, వరికుప్పల ముత్యాలు, ఆశ యూనియన్ నాయకులు రమావత్ కవిత, వసంత, పార్వతమ్మ, అనుష, పద్మ, విమల, రమావత్ శైలు, సైదమ్మ, సునీత, నిర్మల, విజయ, శైలజ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.