Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Thummala Veera Reddy: లాటరీ పద్ధతిలో ఎంపికైన వారికి వెంటనే స్వాధీనపరచాలి

Thummala Veera Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ పట్టణంలో నిర్మించిన 5502 డబల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర మౌలిక సదుపాయాల కల్పిం చి జనవరి 26 నాటికి లబ్ధిదారు లకు స్వాధీన పరచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సందర్శన కార్యక్రమంలో భా గంగా నల్లగొండ పట్టణంలో సిపి ఎం ప్రతినిధి బృందం సందర్శిం చింది. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం సుమారు ఎనిమిది వేలకు పైగా నిర్మించి 1000 మాత్ర మే పంపిణీ చేశారని అన్నారు. అనేక చోట్ల అసంపూర్తిగా నిర్మాణా లు జరిగి శిథిలావస్థకు చేరుతున్న పరిస్థితి ఉందని అన్నారు. కొన్నిచో ట్ల నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారు ని ఎంపిక చేసి స్వాధీనపరచకుం డా కాలయాపన చేస్తున్నారని ఆరో పించారు.

గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు పెట్టి డబల్ బెడ్ రూ మ్ ఇండ్లు నిర్మాణం చేసి ప్రజలకు పంచకుండా దుర్వినియోగం పాల్ప డిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న అసంపూర్తిగా మౌలిక సదుపాయాలు లేకుండా నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు నిధులు కేటాయించి పూర్తిచేసి ప్రజలకు పంచవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నల్గొండ పట్టణంలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన 552 మంది లబ్ధిదారులకు జనవరి 26 నాటికి స్వాధీన పరచాలని డిమాండ్ చేశారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం మాట్లాడుతూ లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు మాత్రమే స్వాధీన పరచాలని డిమాండ్ చేస్తూ జనవరి 6 నుండి 10 వరకు పెదగడియారం సెంటర్లో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామని తెలిపారు. 15 నుండి 25 వరకు వార్డుల వారిగా లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహిస్తామని జనవరి 26న ప్రభుత్వం పంపిణీ చేయని యెడల ఫిబ్రవరి ఒకటి తర్వాత ఏ రోజు నుండైనా సిపిఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి ఆక్రమించి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటారని తెలిపారు.

జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తక్షణమే స్పందించి మౌలిక సదుపాయాలు పూర్తి చేసి లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు స్వాధీన పరచాలని డిమాండ్ చేశారు.ఈ పరిశీలన కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండం పల్లి సత్తయ్య, జిల్లా కమిటీ ఎండి సలీం , డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధనా పోరాట కమిటీ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, అద్దంకి నరసింహ, దండెంపల్లి సరోజ, గాదె నరసింహ, ఊట్కూరి మధుసూద న్ రెడ్డి, భూతం అరుణ, మారగోని నగేష్ , సీత వెంకటయ్య లబ్ధిదారు లు ఎస్కే లతీఫ్ పిచ్చమ్మ సుల్తాన్ నిర్మల సుజాత తదితరులు పాల్గొన్నారు.