Thummala Veera Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పవర్లూమ్ కార్మికుల (Powerloom workers) కూలి రేట్లు పెంచాలని లేనియెడల ఈనెల 20 తరువాత ఏ రోజు నుండైనా నిరవధిక సమ్మె చేయా లని నిర్ణయించినట్లు తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ( సిఐటియు) జిల్లా గౌరవ అధ్య క్షులు తుమ్మల వీరారెడ్డి (Thummala Veera Reddy)తెలిపారు.శుక్రవారం తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ నల్గొండ పట్ట ణ జనరల్ బాడీ సమావేశం పద్మన గర్ మార్కం డేయ గుడి దగ్గర గంజి నాగరాజు అధ్యక్షతన జరి గింది ముఖ్య అతిథిగా హాజరైన వీరారెడ్డి మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ సంస్థలకు కట్టబెడుతూ దేశ సార్వభౌమత్వా న్ని దెబ్బతీస్తుం దని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కనీస వేతనాల చట్టం పనిగంటలు బోనస్ (bonus) ప్రమాదాల కు నష్టపరిహా రం తదితర 44 చట్టాలను రద్దు చేసి నాలుగు కోడులుగా పార్ల మెంటులో ఆమోదించిందని ఆరోపించారు. కార్మిక హక్కులను కాలరాస్తూ యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ విధానం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను 70 ఏళ్ల కృషితో పెం చుకున్న ఆస్తులను ధ్వంసం చేయ డానికి బరితెగించిందని అన్నారు.
మార్పు చేసిన లేబర్ కోడ్ (Labor Code) లా వలన వేతనాల పెంపు కోసం బెరసారాలాడే హక్కు కార్మిక వర్గం కోల్పోతుందని నూతనంగా యూనియన్లు ఏర్పాటు చేసుకో వడానికి కష్టతరమైన నిబంధనలు విధించి కార్మికులను కట్టు బాని సలుగా చేయాలని చూస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం (Central Govt) వెంటనే పునరాలోచించి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ఉపా ధ్యక్షులు ఎండి సలీం మాట్లాడు తూ పవర్లూమ్ కార్మికుల కూలిరే ట్లు పెరుగుతున్న ధరలకు అను గుణంగా పెంచాల్సిన అవ సరం ఉందని అన్నారు. అగ్రిమెంట్ (Agreement) గడవు 2024 మార్చి 31 తో ము గిసినప్పటికీ యజ మానుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో పలు మార్లు నోటీ సు ఇచ్చి తప్పని పరిస్థితుల్లో అక్టో బర్ 20 తర్వాత ఏ రోజు నుండైనా సమ్మె చేయ డానికి కార్మికులు సిద్ధంగా ఉండా లని పిలు పుని చ్చారు.ఈ కార్య క్రమంలో తెలంగాణ పవ ర్లూమ్ వర్కర్స్ యూనియన్ సి ఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సలివోజు సైదాచారి యూనియన్ జిల్లా అధ్యక్షులు పెండెం రాములు జిల్లా ప్రచార కార్యదర్శి పసునూరి యోగానందం పద్మనగర్ ఇండస్ట్రియల్ చర్లపల్లి ఏరియాలో అధ్యక్షులు గంజి నాగరాజు పెండెం బుచ్చి రాములు, చిట్టిపోలు వెంకటేశం కార్యదర్శులు సూరపల్లి భద్రయ్య దేవులపల్లి గిరిబాబు రమేష్ నిమ్మనకోటి సైదులు, ఎస్కే జానీ బిక్షపతి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.

Next Post