Tinmaar mallanna: ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న
వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగు తుంది. బుధవారం ఉదయం ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం వరకు కొట్టాలు కట్టడంతోనే సరిపోయింది.
కొనసాగుతున్న’ ఎమ్మెల్సీ’ కౌంటింగ్
మొదటి ప్రాధాన్యత ఓటు మూడవ రౌండ్ లోనూ కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న ఆదిక్యత
మూడో రౌండ్ ముగిసే సరికి 18,878 ఓట్ల ఆధిక్యంలో మల్లన్న
87,356 ఓట్లతో దీటుగా పోటీని స్తున్న టిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి
మూడో స్థానంలో బిజెపి, నాలుగో స్థానంలో అశోక్ గౌడ్
ప్రజాదీవెన, నల్లగొండ బ్యూరో: వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్(MLC by-election counting)ప్రశాంతంగా కొనసాగు తుంది. బుధవారం ఉదయం ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం వరకు కొట్టాలు కట్టడంతోనే సరిపోయింది. ఆ తర్వాత మొదటి ప్రాధాన్యత ఓటు మొదటి రౌండు లెక్కింపు ఫలితాన్ని అర్ధరాత్రి దాటి న తర్వాత తొలి, మలి రౌండ్ లకు వెలువరించారు అధికారులు. అయితే ఇప్పటివరకు మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి మూడు రౌండ్ల ఫలితాలు వెలువడే సరికి అధికార కాంగ్రెస్ పార్టీ బలపరి చిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న(Tinmar Mallanna)18,878 మెజార్టీ తో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తానికి వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ తో ఉత్కంఠ కూడు కున్నది.
మొదటి ప్రాధాన్యత ఓటు మొదటి రౌండు లోనే కాంగ్రెస్(Congress) బల పర్చిన తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్(BRS) బలపర్చిన ఏనుగుల రాకేష్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. నల్లగొండ లో బుధవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు కోసం ఏర్పా ట్లు ప్రారంభించగా గురువారం సా యంత్రం వరకు కొనసాగుతూనే ఉన్న క్రమంలో సాయంత్రo 4 గంట ల ప్రాంతంలో మూడో రౌండ్ లెక్కిం పు వివరాలు అధికారులు వెల్లడిం చారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,06,234 ఓట్లు,బీ ఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కి 87,356, బీజేపి ప్రేమేందర్ రెడ్డి 34,516, స్వతంత్ర అభ్యర్థి పాల కూరి అశోక్ గౌడ్ కు(Palakuri Ashok Goud)27,493 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 96 టేబుల్స్ పై లెక్కింపు ప్రారంభం కాగా పట్ట భద్రుల ఎమ్మె ల్సీ నియోజకవర్గంలో మొత్తం 4,63,389 ఓట్లు ఉండగా ఇందులో పోలింగ్ లో 3,36,013 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఐదు హాళ్లలో 96 టేబుల్స్ ఏర్పాటు ఏర్పాటు చేసి వీటిని లెక్కి స్తున్నారు.
ఒక్కో టేబుల్ కు వెయ్యి చొప్పున ఒక రౌండ్ లో 96 వేల ఓట్ల ను లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. మూడో రౌండ్ కౌటింగ్ పూర్తి… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదటి ప్రాధాన్యత ఓటు కు సంబంధించి నాలుగో రౌండు కొనసాగుతుంది. లెక్కింపు ప్రక్రియ లో భాగంగా ఇప్పటివరకు మూడు రౌండ్లలో 2,88,000 ఓట్లను లెక్కిం చగా నాలుగో రౌండ్ లో మరో 48, 013 ఓట్లు లెక్కిoచనున్నారు. ఈ నాలుగో రౌండ్ తో మొదటి ప్రాధా న్యత ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.నాలుగో రౌండ్ కూడా పూర్తి అయిన వెంటనే చెల్లుబాటైన ఓట్లలో సగాని కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. కానీ మొద టి ప్రాధాన్యత ఓట్లలో ఏ ఒక్క అభ్యర్థికి కూడా గెలుపుకు అవసర మైన సరిపడా ఓట్లు వచ్చే అవకా శం లేనందున రాత్రి 9 గంటల ప్రాం తంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టనున్న అధికారులు పేర్కొంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రకారo నల్ల గొండ(Nalgonda) ఖమ్మం జిల్లా శాసనమం డలి ఎన్నికల ఫలితాలు రెండో ప్రాధాన్య త ఓటు లెక్కతో మాత్రమే చేయా లని ఉంది అనేది సుస్పష్టం.
Tinmaar mallanna lead in MLC by Elections