Tinmar mallanna: తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్ల న్న గెలుపులో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించా లని స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర చైర్మన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షు డు కొత్తకాపు శివసేనారెడ్డి అన్నా రు.
రాష్ర్ట యువజన కాంగ్రెస్ అధ్య క్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పట్టభద్రుల ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్ల న్న గెలుపులో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించా లని స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర చైర్మన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షు డు కొత్తకాపు శివసేనారెడ్డి అన్నా రు. తీన్మార్ మల్లన్నను(Tinmar Mallanna)గెలిపిం చాలని కోరుతూ శుక్రవారం నల్గొండ లోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati Reddy Venkata Reddy)క్యాంప్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గౌని రాజా రమేష్ యాదవ్ అధ్యక్షతన యువ జన కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహాక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో శివసేనారెడ్డి(Shiv Sena Reddy)ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతీ యూత్ కాంగ్రెస్ కార్యకర్త మల్ల న్న గెలుపు కోసం కృషి చేయాలన్నా రు. యువజన కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టు లు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నిక ల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్ప ష్టం చేశారు. కాంగ్రెస్(Congress) పార్టీ నల్గొండ పట్టణాధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ(ZPTC) వంగూరి లక్ష్మయ్య మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలిస్తే ఆ క్రెడిట్ యవజన కాంగ్రెస్ కు దక్కు తుందన్నారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి రామ్ సింగ్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టా రాకేష్, ఎండీ గౌస్, జిల్లా ఉపాధ్యక్షుడు జయంత్ రెడ్డి, నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు జహంగీర్ బాబా, సాగర్ నియో జకవర్గ అధ్యక్షుడు పగడాల నాగ రాజు, మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షుడు అజార్, దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షుడు హరికృష్ణ. నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, నల్గొండ(Nalgonda) పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు, మండలాధ్యక్షుడు కోప్పు నవీన్ గౌడ్, కనగల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కుసుకుంట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
Tinmaar mallanna win in MLC Elections