ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ కలక్టరేట్ ముందు 18వ రోజు నిరవధిక సమ్మె కొనసాగింది. భారత మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి కి సంతాపంగా తన చిత్ర పటానికి పూలతో శ్రద్ధాంజలి ఘటించి రెండు నిముషాలు మౌనం పాటించారు.
ఈ సందర్బంగా సంతాప సూచకంగా ఎలాంటి నిరసన తెలపలేదు.18 రోజులుగా సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అధ్యక్ష కార్యదర్శులు మొల్గురి కృష్ణ , బొమ్మాగాని రాజు మాట్లాడుతూ ప్రభుత్వం చేసే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఉపసంహరించుకొని సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర నాయకత్వంతో చర్చించి పరిష్కరించాలని కోరారు. అప్పటివరకు సమస్త జిల్లా ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతుగా వారి పనులు చేయకుండా సహాయ నిరాకరణ చేయాలని కోరారు. కేజీబీవీలకు ఎమ్మార్సీలకు భవిత సెంటర్లకు డిప్యూటేషన్ పై వెళ్లి మా విధులు నిర్వహించి మా పొట్ట కొట్టొద్దని వేడుకున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరై టీఎన్జీవో నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మురళి, శేఖర్ రెడ్డి, రాజు,తెలంగాణ ఉద్యమకారులు టిటిఎఫ్ నాయకులు కే ప్రభాకర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కన్వీనర్ సుధాకర్ రెడ్డి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పూర్వ అధ్యక్షులు ఎడ్ల సైదులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ క్రాంతికుమార్ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ సావిత్రి పాండు నాయక్ రహీం , నాగయ్య ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, లలిత రమేష్ కుమార్ సలహాదారులు కే కొండయ్య, నిరంజన్, లింగయ్య యాదగిరి, ఓకే సలహాదారు నీలాంబరి వసంత, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజుల కార్యనిర్వాహ అధ్యక్షులు కొండ చంద్రశేఖర్, కోశాధికారి పుష్పలత, ప్రచార కార్యదర్శి చెందపాక నాగరాజు, రవి సాయిలు, మైఈజ్ ఖాన్ పరమేష్, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.