Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Traffic Rules: ఆటో డ్రైవర్ లు ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలి

–నిర్లక్ష్యంగా ఆటోలు నడిపి ప్రాణా ల మీదికి తెచ్చుకోవద్దు
–ఆటో డ్రైవర్లతో నూతన ట్రాఫిక్ సిఐ రాజు అవగాహన సమావేశం

Traffic Rules: ప్రజా దీవెన, నల్లగొండ: ఆటో డ్రైవ ర్లంతా ఆటోలు నడిపే సమయంలో తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules)పాటించాలని నూతన ట్రాఫిక్ సిఐ డి.రాజు (Traffic CI D. Raju) అన్నారు. శుక్రవారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ట్రాఫిక్ సిఐ రాజు ఆటో డ్రైవర్లతో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహిం చారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిం చాలని వినూత్నంగా ఆటో డ్రైవర్ల కు గులాబీ పూలను అందజేశారు. ఈ సందర్భంగా సిఐ రాజు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో నడిపి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచిం చారు. తమ వెనుక కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారని గుర్తుపెట్టుకుని ఆటోలు సురక్షి తంగా నడుపుకోవాలన్నారు.

అదేవిధంగా తప్పకుండా లైసె న్సులు, ఇన్సూరెన్స్ (Licenses, Insurance) తీసుకో వాలని, డ్రెస్ కోడ్ (Dress code)పాటించాలని అన్నా రు. తాగి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఆటోలను నడపాలని తెలిపారు. ఆటో రిజిస్ట్రేషన్ నెంబర్ కనపడేలా ఉండాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకోవద్దని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ఆటో డ్రైవర్ల కుటుంబాలు కూడా సురక్షితంగా ఉండాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపా లకు పాల్పడే వారి గురించి తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించి తమ వంతు బాధ్యతల ను నిర్వర్తించాలని కోరారు.

డ్రైవర్ సీటు వెనక భాగంలో డ్రైవర్ పేరు, ఫోన్ నెంబర్ (Driver’s name, phone number) ను ప్రయాణికులకు కనిపించే విధంగా కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని సూచిం చారు.లైసెన్సులు, ఆర్సి, ఇన్సూ రెన్స్ లేని వారంతా వారం రోజుల లోగా తీసుకోవాలని తెలిపారు. లేనియెడల చర్యలు తీసుకుంటా మని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడే డ్రైవర్ల పై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఆటో డ్రైవర్ ప్రయాణికుల శ్రేయస్సు, తమ కుటుంబ సభ్యుల (family member) శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఆటోను నడిపి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని సూచించారు.సమావేశంలో పాల్గొన్న ఓ ఆటో డ్రైవర్ ఆటోకు సంబంధించి అన్ని పేపర్లతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి, ఇన్సూరెన్స్ కలిగి ఉండడం తో అతనికి నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.