— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Tripathi : ప్రజా దీవెన, మర్రిగూడ: మొదటి సారి ప్రసవం అయిన కేసుల విషయంలో ప్రసవం తర్వాత కూ డా వైద్యులు వారిని పరీక్షిస్తూ ఉం డాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డాక్టర్లకు సూచిం చారు.గురువారం ఆమె నల్గొండ జిల్లా మర్రిగూడ 30 పడకల క మ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆక స్మికంగా తనిఖీ చేసి ఔట్ పేషెంట్ల వివరాలు, స్టాఫ్ వివరాలు, మందు లు ,ఆస్పత్రి ద్వారా ప్రజలకు అంది స్తున్న వైద్య సేవలు తదితర అంశా లను పరిశీలించారు. ఆస్పత్రిలో నిర్వహిస్తున్న ప్రసవాలు, ఇమ్యు నైజేషన్ వంటి వాటిపై అడిగి తెలు సుకున్నారు.కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో తగినంత మంది డాక్టర్లు, సిబ్బంది లేనందున ఇబ్బందిగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకు రాగా, సాధ్య మై నంత త్వరగా ఖాళీలన్నింటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుం టా మని కలెక్టర్ తెలిపారు.ఈ సం దర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ అం శాలపై క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రసవమైన తర్వాత మొదటి కాన్పు ల కేసుల విషయంలో పూర్తి జాగ్ర త్తగా చూసుకోవాలని, ప్రసవం త ర్వాత సైతం డాక్టర్లు ఫాలో చేయా లని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ గిరిజన బాలర వసతి గృహాన్ని తనిఖీ చేయగా వార్డెన్ అందుబా టులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆ తర్వాత కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని సందర్శించి 7 వ తరగతి విద్యార్థులతో సైన్స్ పై ప్రశ్నలు, జవాబులను అడిగారు. వివిధ రకాల వైరస్ లు, బ్యాక్టీరియాల గురించి అడిగారు. వైరస్ లు రావడానికి గల కారణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వైరస్లు సోకిన తర్వాత చికిత్సలు, తదితర అంశాలపై పిల్లలకు బోధించారు. జిల్లా కలెక్టర్ వెంట చండూరు ఆర్డీవో శ్రీదేవి, సిహెచ్ సి హాస్పిటల్ సూపరింటెండెంట్, ఇతర అధికా రులు ఉన్నారు .