Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tripathi: దాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి

–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి

Tripathi: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఈ ఖరీఫ్ దాన్యం కొను గోళ్ళను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Tripathi) అధికా రులను ఆదేశించారు. మంగళవా రం ఆమె తన చాంబర్లో ధాన్యం సేకరణ పై అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, పౌరసరఫరాల శాఖ అధికారులతో (Civil Supplies Department officials) సమీక్షించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్లు, తూకం యంత్రాలు, తేమ కొలిచే యం త్రాలు, ఇతర అన్ని రకాల సామా గ్రిని సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ చెప్పారు.

ధాన్యం కొనుగోలును (Purchase of grain) వేగవంతం చేయడమే కాకుండా, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లు లకు పంపించాలని, ఐకెపి, పిఎసి ఎస్ అన్ని ఏజెన్సీలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా చూడాలని చెప్పారు. కొనుగోలు చేసిన దాన్యం వివరా లను ఎప్పటికప్పుడు ట్యాబ్ లో నమోదు చేయడం పూర్తి చేయాల ని చెప్పారు. చెక్ పోస్ట్ (Check post) ల వద్ద విధులకు నియమించబడిన సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం జిల్లాకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.2023 -24 ఖరీఫ్ కష్టం మిల్లింగ్ రైస్, 2022-23 సి ఎం ఆర్ పై కలెక్టర్ సమీక్షించారు.జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.