ప్రజదీవెన, నల్గొండ టౌన్ : నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగ శిబిరాల సందర్శించి వారి దీక్షకు మద్దతు ప్రకటించిన టీఎస్ నల్గొండ జిల్లా కమిటీ.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం మాట్లాడుతూ సమగ్ర శిక్షా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.
కేజీబీవీలకు, యుఆర్ఎస్ సిబ్బందికి టీఎస్ యుటిఎఫ్ సంఘం పోరాటాల ద్వారా ఎన్నో హక్కులు సాధించబడ్డాయని ఇక ముందు కూడా వారికి మినిమం స్కేల్ సాధించేవరకు టియస్ యూటీఎఫ్ సంఘం వారి వెన్నంటే ఉండి వారి సమస్యల సాధనకు పోరుడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, నలపరాజు వెంకన్న, పూర్వ జిల్లా కార్యదర్శి పి. రాజశేఖర్, మండల బాధ్యులు సిహెచ్. లక్ష్మీనారాయణ, మధు, శేఖర్, సిహెచ్. సైదులు తదితరులు పాల్గొన్నారు.