టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కమిటి
ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : గత 21 రోజుల నుంచి సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు అనగా కేజీబీవీ, యుఆర్ఎస్, సి ఆర్ పి లు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం పిలిచి ప్రభుత్వం చర్చలకు పిలిచి ఉపాధ్యాయ సంఘాలతో కో ఆర్డినేషన్ మీటింగ్ సమావేశం నిర్వహించి వాళ్ళు ఒప్పించి సమ్మె విరమింప చేయకుండా ఏకపక్ష నిర్ణయాలతో జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇవ్వడం సరైనది కాదని టీఎస్ యుటిఎఫ్ నల్గొండ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ఈ డిప్యూటేషన్ లను ఉపసంహరించుకొని సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులను పిలిచి వారి సమస్య పరిష్కారం చేసి సజావుగా యుఆర్ఎస్, కేజీబీవీ విద్యాసంస్థలను సిబ్బందిని పని చేయించాలని కోరుతున్నాము.
ఈ విధంగా డిప్యూటేషన్ లు ఇవ్వడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల మధ్య ఒక అగాధం సృష్టించి ప్రభుత్వం పబ్బం గడుపుకోవాలని చూస్తుంది. ఇది సరైనది కాదు. ఈ డిమాండ్లు ఇప్పటికిప్పుడే వచ్చినవి కావు సుప్రీంకోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకే సమగ్ర శిక్ష ఉద్యోగులు కోరుతున్నారు.15 రోజుల ముందే నోటీస్ ఇచ్చిన ప్రభుత్వం మొక్కుబడి చర్చలు జరపడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. కాబట్టి ఈ అనివార్య పరిస్థితిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నల్గొండ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది.