Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TUWJ: జర్నలిస్టుల సంక్షేమం టియూ డబ్ల్యూ ధ్యేయం

నల్లగొండ జిల్లాలోని ప్రతి ఒక్క జర్నలిస్టు సంక్షేమమే ధ్యేయంగా టి యు డబ్ల్యూ జే 143 ముందుకు సాగుతుందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షుడు గుoడగోని జయ శంకర్ గౌడ్ పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ళ స్థలాలు
చిన్న పత్రికల జర్నలిస్టుల సమ స్యలపై పోరాటం
యూనియన్ అనుబంధంగా చి న్న, మధ్యతరహా నూతన కమిటి ప్రకటన
టియూడబ్ల్యూ జిల్లా అధ్యక్షుడు గుండగోని జయ శంకర్ గౌడ్

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లాలోని ప్రతి ఒక్క జర్నలిస్టు సంక్షేమమే ధ్యేయంగా టి యు డబ్ల్యూ జే 143 ముందుకు సాగుతుందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(Telangana Union of Working Journalists) జిల్లా అధ్యక్షుడు గుoడగోని జయ శంకర్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లా వ్యా ప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అర్హు లైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అం దే విధంగా ప్రభుత్వం,జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati Reddy Venkata Reddy) సహకారం తో ఆయా నియోజకవర్గాల శాసన సభ్యుల సమన్వయంతో కలిసి కృషి చేయడం జరుగుతుందని వివరించారు.

గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని యూని యన్ కార్యా లయంలో టి యు డబ్ల్యు జే 143 అనుబంధ చిన్న మధ్య తర హా పత్రికలు, ఆన్ లైన్ మీడియా నూతన కమిటీ ని ప్రకటించిన అ నంతరం ఆయన మాట్లాడారు. చి న్న, మధ్యతరహా పత్రికల జర్నలి స్టుల సమస్యలు ప్రధానంగా ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనం త త్వరితగతిన పరిష్కారానికి నో చుకునే విధంగా నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రధానం గా చిన్న పత్రికలు స్థాపించుకుని సొంత కాళ్లపై నిలబడి జీవనం సాగిస్తూ అర్హులైన జర్నలిస్టులకు అందరికి ఇళ్ళ స్థలాల లబ్ది చేకూరే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. లోక్ సభ ఎన్నికల కోడ్(Lok Sabha Election Code) అమలులో ఉన్న oదున ఎన్నికల తర్వాతే యూని యాన్ నాయకత్వం సదరు కార్యా చరణను ముందుకు తీసుకెళ్లి ఇళ్ళ స్థలాల కోసం కృషి చేయడం జరు గుతుందని వివరించారు. చిన్న మ ధ్య తరహా పత్రికలు ఆన్లైన్ మీడియా (Online Media ) నూతన జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకున్నందున ఇళ్ల స్థలాల సాధ నలో మీ పాత్ర కూడా నిర్మాణాత్మ కంగా ఉండాలని ఆయన నూతన కమిటీ సభ్యులను కోరారు.

నూతన కమిటీ సభ్యులు త్వరలో మొదటి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక సంఘటిత సహృ ద్భావ వాతావరణంలో ఎటువంటి అరమరికలు లేకుండా ప్రతి ఒక్కరు సోదర భావంతో మెలగాలని సూ చించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న నూతన కమిటీ సభ్యులు అందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని ముగించారు. ఈ సమావేశంలో టి యు డబ్ల్యూ జే 143 రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ మామి డి దుర్గాప్రసాద్, యూనియన్ నల్లగొండ నియోజకవర్గ కమిటీ కార్యదర్శి దండంపల్లి రవి కుమార్ గౌడ్, ఉపాధ్యక్షుడు సైదులు, ముచ ర్ల శ్రీనివాస్ గౌడ్ తదితరుల పాల్గొ న్నారు.

నూతన జిల్లా కమిటీ… గౌరవ అధ్యక్షునిగా పి.నరహరి, ముఖ్య సలహాదారునిగా అంజయ్య, అధ్య క్షునిగా పి.నవీన్ కుమార్, ఉపా ధ్యక్షులుగా ఏ ఎన్ చారి, మన్నె శోబన్ బాబు, ప్రధాన కార్యదర్శిగా వి.రాజు, కార్యదర్శిగా ఉమా మహే శ్వర్, మహేష్, జె.నాగ రాజు, కె.హ రి, జాని, మధు కోశాధి కారిగా ఇ. సందీప్, ప్రచార కార్యద ర్శిగా నరేష్, సాంస్కృతిక కార్యద ర్శిగా కె.సతీష్, కార్యనిర్వాహక సభ్యు లుగా కె.శివ, ఎం.కిరణ్ కుమార్ జె.సురేష్, చంద్ర శేఖర్ తది తరుల నూతన కమిటీలో నియామకమయ్యారు.

TUWJ main aim journalist welfare