–సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి
Union Budget 2025: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : తెలంగాణ రాష్టంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో సిపిఐ బరిలో నిలి చేందుకు సిద్ధంకావాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి పార్టీ శ్రేణులకు పిలు పునిచ్చారు. స్థానిక మాగ్ధుమ్ భవనంలో జిల్లా కౌన్సిల్ సమావేశం గురువారం జరిగినది ఈ సమా వేశంలో పల్లా వెంకటరెడ్డి ముఖ్య తిధిగా హాజరై మాట్లాడుతూ స్థాని క సంస్థలైన ఎంపిటిసి, జడ్ పిటిసి, మున్సిపల్, సర్పంచ్ ఎన్నికల్లో అధి క స్థానలలో పోటీచేసి ప్రజాసమస్య ల పరిష్కారంలో ముందుండాలన్నారు.
సామాజిక,ఆర్థిక, విద్యా, ఉపాధి,రాజకీయ సర్వే బిసి కుల గణ,తోపాటు 30ఏండ్ల సుదీ ర్ఘపో రాటామైనా ఎస్ సి వర్గీకరణ ను ఆమోదిస్తూ తెలంగాణ అసెంబ్లీలో చేసిన ఆమోదాని స్వాగతిస్తున్నా మనిఅట్టి ఆమోదని కేంద్ర ప్రభు త్వం తక్షణమే పార్లమెంట్లో చట్టం చేసి ఈవర్గాలకు నాయ్యం చేయా లన్నారు. అదేవిదంగా కేంద్రప్రభు త్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జె ట్ తెలంగాణ రాష్ట్రానికి తీరు అన్యాయం చేసిందని విమర్శించా రు. రాష్ట్ర విభజన చట్టంలో ఏ ఒక్క అంశాన్ని కూడా నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసిన సాగునీటి ప్రాజె క్టులకు నిధులు కేటాయించక పోవడం శోచనీయమన్నారు.
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి బిజెపి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజలకు ఎంత మాత్రం ప్రయోజనం జరగలేదన్నారు. పార్లమెంటులో పదేండ్ల కాలంలో సాధించిన పురోగతి గురించి చె ప్పిందే గాని దాని ద్వారా ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం జరిగిందో చెప్పలేదన్నారు. క్రమంగా వ్యవసా య రంగంలో పెట్టుబడులు పెరగ డం పండించిన పంటలకు మద్దతు ధరలు రాకపోవడంతో తీవ్ర సంక్షో భంలోకి మెట్టబడిన తప్ప కనీసం మద్దతు ధర కల్పిం చలేకపో యిం దన్నారు.
జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల న్నారు.ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధువు, ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులు సంక్షేమ పధకాలు ఇచ్చే పక్రియ వెంటనే చేపట్టి అర్హులైన వారికి ఇవ్వాల న్నారు. సమావేశానికి జిల్లా కార్యవర్గసభ్యలు టి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహ రెడ్డి, సీనియర్ నాయకులు ఉజ్జిని రత్నాకరావు, మల్లేపల్లి ఆదిరెడ్డి,మాజీ ఎమ్మెల్యే ఉజ్జని యాదగిరిరావు,జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి,లోడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి ఆర్ అంజయ్య చారి, బొలుగురి నరసింహ,బంటు వెంకటేశ్వర్లు,నలపరాజు రామలింగయ్య తదితరులు ఉన్నారు.