Uttam Kumar Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: సుంకిశాల ప్రాజెక్టు కూలడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతే కారణమని తెలంగాణ నీటిపా రుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), వ్యవసా య శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) లు ఆరోపించారు. శుక్రవారం వారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తో కలిసి సుంకిశాలలో ప్రాజెక్టు కూలిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకొని పళ్ళు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడా రు. తొలుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జరిగిన సంఘ టన చిన్నదని, నష్టం కూడా తక్కు వేనని, ఆ నష్టాన్ని కాంట్రాక్టర్ భరి స్తారని స్పష్టం చేశారు.
ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని, ప్రాజెక్టు పూర్తి కాలేదని, నిర్మాణంలో లేదని, నిర్మాణం పూర్తి కావడానికి ఒకటి, రెండు నెలలు పట్టేదని, ప్రస్తు తం నిర్మాణం ఆలస్యం కానుందని ప్రచ్చనించారు. గత ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయలేదని, ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టు (SLBC project) ఎట్టి పరిస్థితు ల్లోనూ పూర్తి చేస్తామని, డిండి ఎత్తి పోతల పథకం కూడా పూర్తి చేస్తా మని, బీఆర్ఎస్ నాయకులు(Leaders of BRS)ఎం దుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదని, సుంకిశాల అన్ని పనులు బీఆర్ఎస్ హయంలోనే జరిగాయని గుర్తు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించింద న్నారు. ప్రాజెక్టు కూలిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్తా మన్నారు. జరిగిన నష్టాన్ని నిర్మాణ సంస్థే భరిస్తుందన్నారు.
ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నామని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పనులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) మాట్లాడుతూ గోదావరి నదిపై ప్రాజె క్టుల నిర్మాణం జరిగినంత వేగంగా కృష్ణా నది ప్రాజెక్టుల పనులు జరగ డం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సుంకిశాల ప్రాజెక్టు ఎందుకు ప్రారం భించారో కేసీఆర్, కేటీఆర్‌కే తెలి యాలని వ్యాఖ్యానించారు. హైదరా బాద్, సికింద్రాబాద్ జంట నగరాల కు తాగునీరు అందించేందుకు సుం కిశాల అవసరం లేదని అభిప్రాయ పడ్డారు. ఇది కేసీఆర్ మానస పుత్రి కనో లేక కేటీఆర్ మానస పుత్రికనో అర్థం కావడం లేదని వ్యాఖ్యానిం చారు. కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ రాజ కీయ విమర్శలు చేయడం సరికా దన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Prev Post