labour department: కార్మిక శాఖ ఖాళీలను భర్తీ చేయాలి
తెలం గాణ రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం వెంటనే కార్మిక శాఖను సమీక్షించి ఖాళీ ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు.
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలం గాణ రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం వెంటనే కార్మిక శాఖను సమీక్షించి ఖాళీ ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. శని వారం సుంద రయ్య భవన్లో కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూని యన్ (సిఐటియు)(CITU) నలగొండ పట్టణ విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడు తూ వేలాదిమంది భవన నిర్మాణ కార్మికులు(Construction workers) లేబర్ కార్డుల కోసం మ్యారేజ్ గిఫ్ట్ ప్రసూతి సహాయం, సాధారణ ప్రమాదవశాత్తు మర ణాలకు దరఖాస్తులు చేసుకున్న వాటిని పరిశీలించి పరిష్కరించ డానికి లేబర్ అధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో తీవ్ర ఇబ్బం దులు అవుతున్నాయని ఉన్నారు.
ప్రభుత్వం వెంటనే కార్మిక శాఖను(Department of Labor) సమీక్షించి అవసరమైన సిబ్బంది ని వెంటనే నియమించాలనిడిమాండ్ చేశారు. గతంలో మంత్రి హామీ ఇచ్చిన విధంగా భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్లు ఇవ్వా లని, 50 సంవత్సరాలు నిండిన నిర్మాణ కార్మికులకు నెలకు 6000 పెన్షన్ ఇవ్వాలని, ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ. 10 లక్షలు సాధారణ మరణానికి ఐదు లక్షలు వివాహా,ప్రసూతి కానుక లక్ష రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు.
ఇల్లు లేని నిర్మాణ కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లలో(Indiramma houses) మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంలో కార్పెంటర్ పనులను కాంట్రాక్టర్లు కాకుండా నేరుగా కార్మికులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూని యన్ (సిఐటియు) పట్టణ అధ్యక్షులు సరివోజు సైదాచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి దాసోజు ప్రభు చారి నాయకులు కావలపల్లి సురేష్, బైరోజు ఆంజనేయులు, మొపూరి వెంకటాచారి, కంచర్ల మధన చారి శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.
Vacancies in labour department filled