ప్రజాదీవెన, నల్గొండ :రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ నుండి నల్గొండ జిల్లాలోకి వచ్చే దాన్యం వాహనాలను ఎట్టి పరిస్థితులలో అనుమతించకూడదని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ వాడపల్లి చెక్ పోస్ట్ అధికారులు,సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే 10 ధాన్యం వాహనాలను తిప్పి పంపారు.
మంగళవారం రాత్రి అదనపు కలెక్టర్ పౌర సరఫరాల శాఖ అధికారులతో వాడపల్లి చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.వాడపల్లి సరిహద్దు చెక్పోస్ట్ ను దాటి ఏపీ నుండి వచ్చే ధాన్యం వాహనాలు ఎట్టి పరిస్థితులలో నల్గొండ జిల్లాకు రాకుండా చూసుకోవాల్సిందిగా ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా పారసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌసరఫరాల మేనేజర్ హరీష్ తదితరులు ఉన్నారు.