Venkata Madhu : ప్రజాదీవెన, నల్గొండ : హుజూర్ నగర్ (నల్గొండ జిల్లా) జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) నల్గొండ జిల్లా కమిటీ అధికార ప్రతినిధిగా హుజూర్నగర్ కు చెందిన సామాజిక ఉద్యమకారుడు, ఆర్టిఐ కార్యకర్త నీలం వెంకట మధును నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా అధ్యక్షురాలు పేరపాక నిర్మలాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఊరుకొండ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధిగా నియామకమైన నీలం వెంకట మధు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో సంస్థ బలోపేతం కోసం నీతి నిజాయితీతో, చిత్తశుద్ధితో కృషి తీస్తానని ఆయన అన్నారు. నీలం వెంకట మధును ఎన్ హెచ్ ఆర్ సి నల్గొండ జిల్లా అధికార ప్రతినిధిగా నియామకంతో జిల్లాలోని సామాజిక ఉద్యమకారులు ఆర్థిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా నలుమూలల నుండి అభినందనలు తెలిపారు.