— ఐక్యరాజ్యసమితి ఎకాడమిక్ కౌన్సిల్ సభ్యుడు ఆదోని వెంకట రమణ రావు
Venkata Ramana Rao:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: అమెరికా లోని న్యూయార్క్ (New York)నగరంలో గల ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం లో సెప్టెంబర్ 22, 23 తేదీలలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సైబర్ నేరాలపై (On international cybercrime) చట్టా ల గురించి సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ కాన్ఫరెన్స్ లో పాల్గొనుటకు నల్లగొండ వాసి, ప్రముఖ సైబర్ నేరాల విశ్లేషకులు, ఐక్యరాజ్యసమితి ఎకాడమిక్ కౌన్సిల్ సభ్యులు ఆదోని వెంకట రమణారావుకు (Adoni Venkata Ramana Rao) ఆహ్వానం అందింది. స్పెషల్ అక్రెడేషన్ ఐక్యరా జ్యసమితి (Special Accreditation Committee) ప్రధాన కార్యాలయం ద్వారా ఆహ్వానించబడ్డారు. ఇతను సైబర్ నేరాల చట్టాలపై తమ విలు వైన సలహాలు, సూచనలు. కాన్ఫ రెన్స్ లో అందజేస్తారు. వెంకటరమ ణారావు స్పెషల్ అక్రెడేషన్ ద్వారా ఆహ్వానించబడిన సందర్బంగా నల్ల గొండ మాజీ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) అభినందనలు తెలి యజేశారు. నల్లగొండ వాసికి ఇలాం టి అత్యున్నతమైన అవకాశం లభిం చడం గర్వకారణమన్నారు. పలు వురు రాజకీయ నాయకులు, అధి కారులు, స్నేహితులు వెంకట్ ఆదోనికికి తమ అభినందనలు తెలియజేశారు.