Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vote: ఓటు వేసేందుకు 12 గుర్తింపు కార్డులు

పార్లమెంటు ఎన్నికలలో ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డుతో పాటు, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని గుర్తుగా చూపించి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజా దీవెన నల్గొండ: పార్లమెంటు ఎన్నికలలో(parliamen election) ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డుతో పాటు, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని గుర్తుగా చూపించి వారి ఓటు(Vote) హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కేంద్ర ఎన్నికల సంఘం అనువర్తించిన గుర్తింపు కార్డులలో ఆధార్ కార్డు,(Aadhaar card) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకు, లేదా పోస్ట్ ఆఫీస్ లు ఫోటోతో సహా జారీ చేసిన పాస్ బుక్, కేంద్ర కార్మిక శాఖ ద్వారా జారీ చేయబడిన ఆరోగ్య భీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఆర్బిఐ ఎన్ పి ఆర్ కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు, ఇండియన్ పాస్ పోర్ట్, ఫోటో కలిగిన పెన్షన్ డాక్యుమెంటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ సెక్టర్ అండ్ టేకింగ్ సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్(Public Limited) కంపెనీలు వారి ఉద్యోగులకు జారీచేసిన ఫోటో గుర్తింపు కార్డు, ఎంపీ ,ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డు, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ జారీచేసిన యూనిక్ దివ్యాంగ కార్డులలో ఏదో ఒకదానిని గుర్తింపుగా చూయించి ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు.

vote cast with 12 ID cards