Vote: ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని మరింత బలం చేయాలి
ప్రస్తుతం జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న యువత, విద్యార్థులు, చదువుకున్న వారు తప్పనిసరిగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా.బొమ్మర బోయిన కేశవులు సూచించారు.
ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా. బొమ్మరబోయిన కేశవులు
ప్రజా దీవెన నల్గొండ: ప్రస్తుతం జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న యువత, విద్యార్థులు, చదువుకున్న వారు తప్పనిసరిగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని(democracy) మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా.బొమ్మర బోయిన కేశవులు సూచించారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ, కామినేని మెడికల్ కళాశాల సంయుక్తంగా శనివారం నార్కెట్ పల్లి లోని కామినెన్ మెడికల్ కాలేజీ సెమినార్ హాల్లో నిర్వహించిన ఓటరు చైతన్య కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. దేశంలో లోకసభ ఎన్నికలు ప్రారంభమయ్యాయనీ ఐదు దశలలో జరగనున్న ఎన్నికలలో ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు జరిగాయని వివరించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఓటర్లు బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలనీ సూచించారు.
ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నిరక్షరాస్యులు, పేదలు ఓటింగ్ లో పాల్గొంటూ తమ ఓటు హక్కును ఎక్కువ శాతం వినియోగించుకుంటున్నారనీ చెప్పారు. పట్టణ ప్రాంతాలలో చదువుకున్న వారు కొంతమంది ఓటుకు దూరంగా వుండటం వల్ల ఓటింగ్ శాతం తక్కువ నమోదవుతున్నధని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో హైదరాబాద్ లో తక్కువ ఓటింగ్ శాతం మాత్రమే పోల్ అవడం ఇందుకు ఉదాహరణ అని తెలిపారు.
సమాజం నుంచి ప్రతి మనిషి ప్రతి ఫలం పొందుతున్నందున, ఓటింగ్(Voting) విషయంలో చదువుకున్న వారు, ఓటు వేయని వారు తమ వైఖరి మార్చుకోవాలని స్పష్టం చేశారు. విద్యావంతులు దీనిని మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. మెడికల్ కళాశాల విద్యార్థులు వంద శాతం ఓటింగ్ లో పాల్గొంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అధికార యంత్రాంగం ఎన్నికలు(Parliament elections) సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందని, ఓటర్లుగా మన వంతు భాధ్యత మనం నిర్వహించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలన్నారు. ఒక వేళ అభ్యర్థులు ఎవరు నచ్చని పక్షంలో నోటా కు ఓటు వేయాలనీ సూచించారు. ఎన్నికలలో అక్రమాల నిరోధానికి సీ-విజిల్ ఆఫ్ ని డౌన్లోడ్ చేసుకుని అక్రమాలపై పిర్యాదు చేయాలని కోరారు.
జల సాధన సమితి జాతీయ అధ్యక్షులు దుషార్ల సత్యనారాయణ మాట్లాడుతూ
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని చెప్పారు. నాయకులు అందరు ప్రజలకు సేవకులని చెప్పారు. మన రాజ్యాంగం సుప్రీం అని వివరించారు. ఎన్నికలలో వున్న కలుపును మహిళలు తమ ఓటు తో ఏరిపారేయాలనీ సూచించారు. కామినేని ఆసుపత్రి సూపరిన్డెంట్
కల్నల్ డా. ఎడ్విన్ లూథర్ మాట్లాడుతూ విద్యార్థులు ఓటు హక్కు పై అవగహన పెంచుకొని పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కన్నెబోయిన ఉషారాణి, కామినేని మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా.రంగారావు, పీఆర్వో కిరణ్, సందీప్, అజ్మాత్, ఎం.డీ. సాధత్అలీ, కామినేని మెడికల్ కాలేజీ సిబ్బంది, సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Vote for strengthen Indian democracy