Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vemula veeresham: ఎన్నికల్లో కాంగ్రెసు కు సంపూర్ణ మద్దతు

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా మద్దతునివ్వాలని నకిరే కల్ శాసన సభ్యుడు వేముల వీరే శం ప్రజలను కోరారు.

నకిరేకల్ శాసన సభ్యుడు వేముల వీరేశం
ప్రజా దీవెన, చిట్యాల: రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా మద్దతునివ్వాలని నకిరే కల్ శాసన సభ్యుడు వేముల వీరే శం ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బూత్ స్థాయిలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించాలని ఆయన సూచిం చారు. చిట్యాల, నార్కట్ పల్లి, కట్టంగూర్ మండల కేంద్రాల్లో శుక్ర వారం వేర్వేరుగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎలాంటి చరిత్ర లేని బీజేపీని ఓడిం చాలని పిలుపు నిచ్చారు

ఈ నెల 21న కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంటు నియో జకవర్గ అభ్యర్థి చామల కిరణ్ కు మార్ రెడ్డి నామినే షన్ కార్యక్ర మాన్ని భారీ స్థాయిలో విజయ వంతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కంకణ బద్ధుడు కావాలని కోరారు. ఈ సమావేశంలో మున్సి పల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి పోకల దేవదాసు, డీసీసీ ఉపాధ్య క్షుడు కందిమళ్ల శిశుపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శేపూరి యాద య్య, ఏఎంసీ మాజీ చైర్మన్ కాటం వెంకటేశం, కాంగ్రెస్ మండల అధ్య క్షుడు గుడిపాటి లక్ష్మీనర్సింహ, జడల చినమల్లయ్య, నార్కట్ పల్లి పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, నాయకులు అలుగుబెల్లి రవీందర్ రెడ్డి, బండ సాగర్ రెడ్డి, సిద్దగోని స్వామి గౌడ్, పాశం శ్రీనివాస్ రెడ్డి, జేరిపోతుల భరత్, సట్టు సత్తయ్య. పుల్లెంల అచ్చాలు, ప్రజ్ఞాపురం సత్యనారయణ, కట్టంగూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, మాజీ జెడ్పీటీసీలు సుంకర బోయిన నర్సిం హ్మ, మాద యాదగిరి, రెడ్డిపల్లి సాగ ర్, ఎంపీటీసీ పాలడుగు హరికృష్ణ, చింత వెంకట్న ర్సయ్య, మిట్టపల్లి శివశంకర్, రెడ్డిపల్లి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Voters supported to congress