MLC Election voting method: పట్టభద్రులు ఓటు వేయండిలా
వరంగల్,ఖమ్మం,నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లు ఓటు వేసే సందర్భంగా చేయదగినవి, చేయకూడని, పాటించాల్సిన నియమాలను తదితర అంశాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన శనివారం వివరంగా తెలియజేశారు.
ఓటు వేసే సమయంలో నిబంధనలు తప్పనిసరి
కలెక్టర్ హరిచందన దాసరి
ప్రజా దీవెన నల్గొండ: వరంగల్,ఖమ్మం,నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లు ఓటు వేసే సందర్భంగా చేయదగినవి, చేయకూడని, పాటించాల్సిన నియమాలను తదితర అంశాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల(graduate by MLC Elections) ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి(Collector Harichandana Dasari) దాసరి హరిచందన శనివారం వివరంగా తెలియజేశారు.
ఓటర్లు(Voting) వారు ఓటు వేసే అభ్యర్థికి ఎదురుగా బ్యాలెట్ పేపర్ తో పాటు ఎన్నికల సంఘం ద్వారా సరఫరా చేయబడిన వాయిలెట్ స్కెచ్ పెన్ ను మాత్రమే ఉపయోగించాలి
ఓటరు ఓటు వేసేందుకు ఎంచుకున్న అభ్యర్థికి ఎదురుగా 1, లేదా 2,లేదా 3, 4 ప్రాధాన్యత క్రమంలో మాత్రమే అంకెల రూపంలో పేర్కొనాలి
మొదటి ప్రాధాన్యత ఓటు కింద 1 వ అంకెను, ఒక అభ్యర్థి కి ఎదురుగా ఉన్న స్థలంలో మాత్రమే మార్కు చేయవలసి ఉంటుందని
ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ, బ్యాలెట్(Ballot paper) పేపర్ లో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లకు ఎదురుగా1,2,3, వంటి అంకెల రూపంలో మాత్రమే ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలి
ఓటర్లు ఓటు వేసేటప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎదురుగా భారతీయ సంఖ్యలైన 1,2,3, మార్క్ చేయాలి
ఓటర్లు చేయకూడని అంశాలు….
బ్యాలెట్ పేపర్ పై ఇద్దరు అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు (1 ) వ సంఖ్య ఇవ్వకూడదు
బ్యాలెట్ పేపర్ పై సంతకం చేయడం, లేదా ఇనిషియల్ వేయటం, పేరు, అక్షరాలు వంటివి రాయకూడదు.
ఓటరు బ్యాలెట్ పేపర్ పై 1,2,3,4,5 సంఖ్యల రూపంలో మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వాలి.
ఓటరు బ్యాలెట్ పేపర్ పై పదాల రూపంలో, వన్, టూ, త్రీ అని రాయకూడదు.
అలాగే బ్యాలెట్ పేపర్ పై రైట్ మార్క్ టిక్ చేయడం లేదా ఇంటు మార్కు పెట్టడం వంటివి సైతం చేయకూడదు.
ఒకే అభ్యర్థికి రెండు ప్రాధాన్యతలు ఇవ్వకూడదు. ఉదాహరణకు ఒకే అభ్యర్థికి 1,2 సంఖ్యలు వేయకూడదు.
బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థికి కేటాయించిన స్థలంలో మాత్రమే 1,2,3, అంకెలు వేయాలి. అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులకు వర్తించేలా నంబర్ మార్కు చేయకూడదు.
Voting method in MLC Elections